శివన్న నమ్మకమే గెలిచింది
జైలర్(Jailer) లో చేసిన క్యామియోతో తెలుగు ప్రేక్షకులకు సుపరిచితుడైన కన్నడ స్టార్ హీరో శివరాజ్ కుమార్(Sivaraj Kumar) తెలుగులో మార్కెట్ ను పెంచుకోవాలని చూస్తున్నాడు. ఇప్పటికే రామ్ చరణ్16(RC16)లో శివన్న(Sivanna) కీలక పాత్ర చేస్తున్న విషయం తెలిసిందే. విజయ్69(Vijay69)లో కూడా ఆయనకు ఆఫరొచ్చిందన్నారు కానీ ఆ పాత్రకు సరైన ప్రాధాన్యం లేకపోవడంతో డైరెక్టరే వద్దన్నాడని శాండిల్‌వుడ్ మీడియా వర్గాలు చెప్తున్నాయి.
ఇదిలా ఉంటే పోయిన వారం రిలీజైన కంగువ(Kanguva)తో పోటీ ఎందుకులే అని అందరూ సైడ్ అయిపోతే శివన్న మాత్రం భైరతి రణగల్(Bhairathi Ranagal) తో నవంబర్ 15న ప్రేక్షకుల ముందుకొచ్చాడు. థియేటర్ల కొరత కారణంగా కేవలం కన్నడలో మాత్రమే ఈ సినిమా రిలీజైంది. సింగిల్ లాంగ్వేజ్ లో రిలీజైన ఈ సినిమా హిట్ టాక్ తో మంచి కలెక్షన్స్ సాధిస్తోంది.
నర్తన్(Narthan) దర్శకత్వం వహించిన భైరతి రణగల్, మఫ్టీ(Mufti) అనే సినిమాకు ప్రీక్వెల్ గా రూపొందింది. మఫ్టీ సూపర్‌హిట్ అవగా, ఇప్పుడీ భైరతి రణగల్ కూడా హిట్ దశగా దూసుకెళ్తుంది. కంటెంట్ పై శివన్న పెట్టుకునే నమ్మకమే నిజమైంది. రెగ్యులర్ కమర్షియల్ డ్రామాగా రూపొందిన ఈ సినిమా మంచి ఎలివేషన్లు, కథ, స్క్రీన్ ప్లే మాస్ వర్గాలను మెప్పించేలా ఉండటంతో శివన్న సైలెంట్ గా హిట్ కొట్టాడని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. త్వరలోనే ఈ సినిమాను తెలుగులో డబ్ చేసి రిలీజ్ చేయనున్నారు.