ASBL Koncept Ambience
facebook whatsapp X

శ్వేతసౌధంలో ఘనంగా దీపావళి వేడుకలు

శ్వేతసౌధంలో ఘనంగా దీపావళి వేడుకలు

అమెరికన్ల జీవితంలోని ప్రతి  భాగాన్నీ దక్షిణాసియా కమ్యూనిటీ సభ్యులు సుసంపన్నం చేశారని అధ్యక్షుడు జో బైడెన్‌ ప్రశంసించారు. అధ్యక్ష పదవి నుంచి వచ్చే నెలలో వైదొలగనున్న ఆయన శ్వేతసౌధంలో దీపావళి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా బ్లూ రూమ్‌లో లాంఛనంగా దీపం వెలిగించారు. ఈస్ట్‌ రూమ్‌లో జరిగిన ఈ కార్యరకమానికి ఆ దేశంలోని వివిధ ప్రాంతాలకు చెందిన కాంగ్రెస్‌ సభ్యులు, అధికారులు, కార్పొరేట్‌ ఎగ్జిక్యూటివ్‌లు సహా 600 మందికిపైగా ప్రముఖ భారతీయ అమెరికన్లు హాజరయ్యారు.

ఈ సందర్బంగా బైడెన్‌ మాట్లాడుతూ  శ్వేతసౌధంలో గతంతో ఎన్నడూ జరగనంత భారీస్థాయిలో దీపావళి వేడుకలు నిర్వహించడాన్ని అధ్య క్షుడిగా తనకు దక్కిన గౌరవంగా భావిస్తున్నట్లు చెప్పారు. సెనేటర్‌గా, ఉపాధ్యక్షుడిగా, అధ్యక్షుడిగా నా సిబ్బందిలో కీలక సభ్యులంతా దక్షిణాసియా అమెరికన్లే. డాక్టర్‌ వివేక్‌ మూర్తి సహా చాలా మంది మీరు ఈ రోజు ఇక్కడ ఉన్నారు. అమెరికాలా కనిపించే పరిపాలన కావాలన్న నా నిబద్ధతను నిలబెట్టుకున్నందుకు గర్వంగా ఉంది అని చెప్పారు. అమెరికాలో అత్యంగా వేగంగా ఎదుగుతున్న, అన్నింటా భాగస్వామి అవుతున్న జాతిగా దక్షిణాసియా వాసులు ఉన్నారు. అమెరికన్ల జీవితాల్లో ప్రతిభాగాన్ని వారు సుసంపన్నం చేశారు. ఇప్పుడు దీపావళి వేడులకు గర్వంగా, ఘనంగా శ్వేతసౌధంలో జరిగాయి. ఇది నా ఇల్లు కాదు, మీది. ఈ దేశంలో వైవిద్యం మనది. మనం చర్చిస్తాం, విభేదిస్తాం. కానీ మనం ఇక్కడికి ఎందుకు వచ్చామనే విషయాన్ని విస్మరించడం అని పేర్కొన్నారు.

 


 

 

 

praneet praneet praneet ASBL Radhey Skye Radha Spaces
Tags :