ASBL Koncept Ambience
facebook whatsapp X

రష్యా పైకి అమెరికా క్షిపణులు.. దిగిపోయే ముందు జో బైడన్ గ్రీన్ సిగ్నల్...

రష్యా పైకి అమెరికా క్షిపణులు.. దిగిపోయే ముందు జో బైడన్ గ్రీన్ సిగ్నల్...

రష్యా-ఉక్రెయిన్ యుద్ధం మరో స్థాయికి చేరనుంది. ఇన్నాళ్లు తమ దగ్గర ఉన్న లిమిటెడ్ ఆయుధాలతో రష్యాను ఎదురించిన ఉక్రెయిన్.. అమెరికా తయారీ క్షిపణులను రష్యాపైకి వాడేందుకు అనుమతించాలని కోరుతూ వచ్చింది. అయితే వాటికి ఇప్పటివరకూ అమెరికా అంగీకరించలేదు. మరో రెండు నెలల్లో దిగిపోయేముందు బైడన్.. కీలక నిర్ణయం తీసుకున్నారు. రష్యాపైకి మా దీర్ఘ శ్రేణి ఆయుధాలు వాడొద్దంటూ ఇన్నాళ్లూ ఉక్రెయిన్ ను అడ్డుకున్న అమెరికా.. తాజాగా ఈ ఆంక్షలను ఎత్తేసింది. రష్యాపై దాడులకు తాము పంపిన ఆయుధాలను వాడుకోవచ్చని బైడెన్ అనుమతిచ్చారు.

అమెరికా సప్లై చేస్తున్న ఆర్మీ టాక్టికల్ మిస్సైల్ సిస్టమ్ (దీర్ఘ శ్రేణి క్షిపణులు)ను రష్యాపై దాడులకు ఉపయోగించుకోవచ్చని చెప్పారు. మరో రెండు నెలల్లో వైట్ హౌస్ వీడనున్న క్రమంలో బైడెన్ ఈ సంచలన నిర్ణయం తీసుకున్నారు. అయితే, ఈ నిర్ణయంపై అంతర్జాతీయ విశ్లేషకుల నుంచి విమర్శలు వ్యక్తమవుతున్నాయి. బైడెన్ నిర్ణయం మూడో ప్రపంచ యుద్ధానికి కారణమవుతుందని ఆందోళనలు వ్యక్తం మవుతున్నాయి. మరో రెండు నెలల్లో ట్రంప్ అధ్యక్ష బాధ్యతలను చేపట్టనున్నారు. ప్రభుత్వం మారే సమయంలో రష్యాపై ఉక్రెయిన్ ను ఉసి గొల్పడంపై పలువురు అభ్యంతరం వ్యక్తంచేస్తున్నారు.

ఉక్రెయిన్ కూడా రాబోయే మరికొన్ని రోజుల్లో దీర్ఘ శ్రేణి మిసైల్స్తో రష్యాపై దాడులకు ప్లాన్ చేస్తున్నదని నిఘా వర్గాలు చెప్తున్నాయి. లాంగ్ రేంజ్ మిస్సైల్స్ను ఉక్రెయిన్ వాడితే.. ఇరు దేశాల మధ్య మరింత ఉద్రిక్త పరిస్థితులు నెలకొనే అవకాశాలు ఉన్నాయని పలువురు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. బార్డర్ నుంచి రష్యాలోకి 306 కిలో మీటర్ల మేర చొచ్చుకెళ్లి లక్ష్యాలను ఛేదించే ఆర్మీ టాక్టికల్ మిస్సైల్ సిస్టమ్ (ఏటీఏసీఎంఎస్) ను ఉక్రెయిన్ ఉపయోగించొచ్చని తెలుస్తున్నది. బైడెన్ నిర్ణయాన్ని అమెరికాకు చెందిన కొందరు సమర్థిస్తుంటే.. మరికొందరు అనాలోచిత చర్యగా అభివర్ణిస్తున్నారు.

ఉక్రెయిన్, రష్యా మధ్య కాల్పుల విరమణ ఒప్పందం దిశగా అడుగులు వేస్తున్న టైమ్లో దాడులకు ఉసి గొల్పడం సరికాదని కొందరు విమర్శిస్తున్నారు. ఉక్రెయిన్పై రష్యా దాడులు ముమ్మరం చేసిందని, కీవ్ను హస్తగతం చేసుకునేందుకు ప్రయత్నిస్తున్నదని, ఈ టైమ్లో బైడెన్ అనుమతులివ్వడం కరెక్టేనని మరొక వాదన వినిపిస్తోంది. అయితే, బైడెన్ ఆంక్షలు ఎత్తేయడంపై స్పందించేందుకు ‘వైట్‌‌హౌస్’ నిరాకరించింది.

 

 

praneet praneet praneet Koncept Ambience Radhey Skye APR Group
Tags :