ASBL Koncept Ambience
facebook whatsapp X

Duvvada Biopic: అటు మీడియా.. ఇటు సోషల్ మీడియా.. సరిపోదు అన్నట్టు వెండితెర కు ట్రై చేస్తున్న దువ్వాడ..

Duvvada Biopic: అటు మీడియా.. ఇటు సోషల్ మీడియా.. సరిపోదు అన్నట్టు వెండితెర కు ట్రై చేస్తున్న దువ్వాడ..

2024 ఎన్నికల తర్వాత వైసిపి నేతలు (YCP Leaders) ఎందరో సోషల్ మీడియాలో వైరల్ అవుతూ వచ్చారు.. అయితే అందరికంటే ఎక్కువగా దువ్వాడ శ్రీనివాస్( Duvvada Srinivas) పేరు మారుమోగింది. ఇక ఈ ఏడాది ఆగస్టు నుంచి రెండు తెలుగు రాష్ట్రాలలో ఎక్కడ చూసినా దువ్వాడ పేరు ఓ రేంజ్ లో వినిపించింది. అంతేకాదు దువ్వాడ కుటుంబ కథా చిత్రం (Duvvada Kutumba katha chitram)అంటూ సోషల్ మీడియాలో ఎన్నో వీడియోలు వైరల్ అయ్యాయి. తాజాగా దువ్వాడకు సంబంధించిన మరొక ఆసక్తికర విషయం నెట్టింట చెక్కర్లు కొడుతోంది.

ఆంధ్ర రాజకీయాలలోనే కాక రెండు తెలుగు రాష్ట్రాలలో కూడా దువ్వాడ పేరు ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది. దీనికి ముఖ్య కారణం ఆయన భార్య, కుమార్తెలు చేసిన ఆరోపణలు అనడంలో ఎటువంటి డౌట్ లేదు. మరోపక్క తండ్రిని కలవడానికి వచ్చిన కూతుర్లను ఇంటిబయటే బైఠాయింపజేసిన దువ్వాడ వైనం అందరిని ఆశ్చర్యానికి గురిచేసింది.. ఆ తర్వాత వాట్స్అప్ మెసేజ్లు, ఆస్తుల వ్యవహారాలు ఒక్కొక్కటిగా బయటకు రావడంతో పంచాయతీ పార్టీ ఆఫీస్ వరకు చేరింది. ఇదంతా ఒక ఎత్తైతే ఆయనకు దివ్యల మాధురితో (Divvala Madhuri) ఉన్న అనుబంధం మరొక ఎత్తు. 

ఇక మా దువ్వాడకు ఇష్టమైన వంటలు అంటూ మాధురి సోషల్ మీడియాలో చేస్తున్న హంగామా గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఏది ఏమైనా సరే నేను దువ్వాడతోనే కలిసి ఉంటాను.. దీని అడల్ట్రీ (Adultery) అంటారే కానీ లివింగ్ టుగెదర్ అనరు అంటూ వాదించేస్తోంది మాధురి. మరోపక్క ఆయన భార్య కనీసం పిల్లల కోసమైనా దువ్వాడ తనతో కలిసి ఉంటే చాలు అని పేర్కొంటున్నారు. కానీ దువ్వాడ మాత్రం వాణి (Duvvada Vani) తో కలిసి ఉండే ప్రసక్తి లేదంటూ.. డైవర్స్ మాత్రమే తమ సమస్యకు పరిష్కారం అంటూ వాదిస్తున్నారు.

ఇవన్నీ పక్కన పెడితే తాజాగా తిరుమలకు (Tirumala) మాధురి తో దువ్వాడ కలిసి వెళ్లడం.. అనంతరం తిరుమల మాడవీధులలో దిగిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. అంతేకాదు కోర్టు సమస్యలు తీరిన వెంటనే వివాహ బంధం లోకి ఎంటర్ అవుతాం అంటూ వారు చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. ఆ తర్వాత ఓ టీవీ ఛానల్ కి కలిసి ఇంటర్వ్యూ ఇచ్చిన ఈ ప్రేమ జంట.. తమ ప్రేమ గురించి వివరించడం మరింత సంచలనంగా మారింది. అటు మీడియాలో…ఇటు సోషల్ మీడియాలో ఈ ఇద్దరి ప్రేమ కథ వైరల్ అవుతున్న సందర్భంలో మరొక ఆసక్తికర విషయం తెరపైకి వచ్చింది. త్వరలో దువ్వాడ శ్రీనివాస్ బయోపిక్ (Duvvada Srinivas Biopic) తెరకెక్కించడానికి ఓ నిర్మాత హక్కులను కూడా సొంతం చేసుకున్నారని టాక్. ఇక దీనిపై నెట్టెంటా పలు రకాల మిమ్స్ హల్చల్ చేస్తున్నాయి.

 

 

praneet praneet praneet ASBL Radhey Skye Radha Spaces
Tags :