ASBL Koncept Ambience
facebook whatsapp X

బిర్లా ఓపస్ పెయింట్స్ తన తాజా క్యాంపెయిన్ ‘నయే జమానే కా నయా పెయింట్’ కోసం విక్కీ కౌశల్ మరియు రష్మిక మందన్నలను ఎంపిక చేసింది

బిర్లా ఓపస్ పెయింట్స్ తన తాజా క్యాంపెయిన్ ‘నయే జమానే కా నయా పెయింట్’ కోసం విక్కీ కౌశల్ మరియు రష్మిక మందన్నలను ఎంపిక చేసింది

ఏడాది ప్రారంభంలో డెకరేటివ్ పెయింట్స్ రంగంలోకి ప్రవేశించిన అనంతరం, ఆదిత్య బిర్లా గ్రూప్  గ్రాసిమ్ ఇండస్ట్రీస్‌లో భాగమైన బిర్లా ఓపస్ పెయింట్స్ ఇప్పుడు తన తాజా క్యాంపెయిన్ ‘నయే జమానే కా నయా పెయింట్’ అంటే ‘కొత్త యుగానికి కొత్త పెయింట్’ను ప్రారంభించింది. లియో బర్నెట్ ఇండియా రూపొందించిన ఈ చిత్రంలో భారతీయులు అత్యంత ఇష్టపడే ఇద్దరు నటులు - విక్కీ కౌశల్ మరియు రష్మిక మందన్న, బ్రాండ్ అంబాసిడర్‌లుగా తన ప్రత్యేక, విలక్షణమైన లక్షణాలు మరియు నాణ్యత గురించి ఈ ప్రచారంలో మాట్లాడతారు. అలాగే నీనా గుప్తా, సౌరభ్ శుక్లా వంటి అనుభవజ్ఞులైన మరియు బహుముఖ నటులు ఇందులో ఉన్నారు. బిర్లా ఓపస్ పెయింట్స్‌ను ‘కొత్త’ మరియు ‘కావలసింది’గా మార్చే లక్ష్యంతో ప్రత్యేకమైన ఆలోచన, స్టార్ నటులు మరియు దృఢమైన కాన్సెప్టు ఇందులో ఉంది.

ఈ క్యాంపెయిన్ హిందీతో పాటు అన్ని ప్రధాన ప్రాంతీయ భాషలలో అందుబాటులోకి వస్తుండగా, వినియోగదారులకు అవగాహన కల్పించేందుకు, ట్రయల్స్‌ను ప్రేరేపించేందుకు టీవీ, డిజిటల్, ఓఓహెచ్, ప్రింట్ మరియు రేడియో వ్యాప్తంగా 360-డిగ్రీ యాక్టివేషన్‌తో మద్దతు ఉంటుంది.

క్యాంపెయిన్ గురించి బిర్లా ఓపస్ పెయింట్స్ సీఈఓ రక్షిత్ హర్‌గేవ్ మాట్లాడుతూ, “ఈ పండగ సీజన్‌లో ప్రారంభించిస్తున్న మా కొత్త క్యాంపెయిన్, ‘నయే జమానే కా నయా పెయింట్’తో, మేము డైనమిక్ తారాగణంతో మా ఉత్పత్తి పనితీరును హైలైట్ చేస్తున్నాము. విక్కీ కౌశల్, రష్మిక మందన్న  తాజా శక్తి సౌరభ్ శుక్లా మరియు నీనా గుప్తాల కలకాలం ఆకర్షణను ఇందులో చూడవచ్చు. మా వినూత్నమైన, స్ఫూర్తిదాయకమైన విధానాన్ని ప్రదర్శిస్తూ, ఈ క్యాంపెయిన్ మా వినియోగదారులను చక్కగా ఆకట్టుకుంటుందని మేము విశ్వసిస్తున్నాము!’’ అని తెలిపారు.

దీని గురించి బాలీవుడ్ సూపర్ స్టార్ విక్కీ కౌశల్మాట్లాడుతూ, “నేను బిర్లా ఓపస్ పెయింట్స్ కుటుంబంలో భాగమైనందుకు థ్రిల్‌గా ఉన్నాను. వినియోగదారుల జీవితాల్లో చైతన్యాన్ని, వర్ణాలను విస్తరించేందుకు వేచి చూస్తున్నాను. నిజంగా విభిన్నమైన రీతిలో ఈ సినిమాల ద్వారా క్యాంపెయిన్‌కు సృజనాత్మకంగా జీవం పోశారు. ప్రముఖ నటుడు సౌరభ్ శుక్లాతో కలిసి నేను చాలా సరదాగా యాడ్‌ని షూట్ చేశాను. షూట్ సమయంలో ఆయన ఇంప్రూవైజ్ చూసేందుకు కనుల పండువగా ఉంది’’ అని పేర్కొన్నారు.

పాన్ ఇండియా స్టార్ రష్మిక మందన్న మాట్లాడుతూ, “మారుతున్న కాలానికి అనుగుణంగా ఒకరు అభివృద్ధి చెందాలని నేను నమ్ముతున్నాను. బిర్లా ఓపస్ పెయింట్స్ తాజా క్యాంపెయిన్ వాస్తవాల ఆధారంగా ఎంపికలు చేయాలనే నా నమ్మకాన్ని ప్రతిబింబిస్తూ, సాధారణ అభ్యాసానికి విభిన్నంగా ఉంటుంది. బిర్లా ఓపస్‌ నన్ను ప్రచారకర్తగా భాగస్వామి కావడం నాకు సంతోషంగా ఉంది. నీనాగుప్తతో ప్రకటనను చిత్రీకరించడం గొప్ప అనుభవం. నేను బిర్లా ఓపస్ పెయింట్స్‌తో గొప్ప అనుబంధం కోసం ఎదురుచూస్తున్నాను’’ అని తెలిపారు.

ఈ క్యాంపెయిన్ గురించి దక్షిణాసియాలోని లియో బర్నెట్ చైర్మన్ రాజ్‌దీపక్ దాస్ మాట్లాడుతూ “మనం నిరంతరం మార్పు చెందుతూ, మన ఇళ్లు, అవసరాలు మరియు దృక్పథాలను పునర్నిర్మించే ప్రపంచంలో జీవిస్తున్నాం. సమిష్టి తారాగణంతో కూడిన మా చిత్రం గతంలో పాత పాఠశాల పెయింట్‌లు ఎలా పనిచేశాయో వినోదాత్మక దృక్పథాన్ని తెస్తుంది. కొత్త భారతదేశం  ఎప్పటికప్పుడు మారుతున్న అవసరాలను తీర్చేలా ఖచ్చితత్వంతో రూపొందించిన తదుపరి తరం పెయింట్‌లను స్వీకరించడానికి ఇది సమయం’’ అని వివరించారు.

 

 

 

praneet praneet praneet ASBL Radhey Skye Radha Spaces
Tags :