BJP MLA on Pushpa 2 ticket prices: ఆకాశాన్ని అంటుతున్న పుష్ప టికెట్లపై మండిపడ్డ బిజెపి ఎమ్మెల్యే.
అల్లు అర్జున్ (Allu Arjun), రష్మిక మందన్న ( Rashmika Mandanna ) కాంబోలో సుకుమార్ (Sukumar) తెరకెక్కించిన భారీ బడ్జెట్ పాన్ ఇండియన్ చిత్రం పుష్ప 2. ఈ చిత్రానికి పార్ట్ q గా ప్రేక్షకుల ముందుకు వచ్చిన పుష్ప ఏరియన్ సక్సెస్ సాధించిందో అందరికీ తెలుసు .ఈ నేపథ్యంలో రేపు విడుదల కాబోతున్న పుష్పాపై అంచనాలు భారీగా నెలకొని ఉన్నాయి. అయితే ఈరోజు రాత్రి నుంచి ఈ చిత్రానికి సంబంధించిన ప్రీమియం షోలు ప్రారంభమవుతాయి.
ప్రస్తుతం మూవీకి ప్రపంచవ్యాప్తంగా ఉన్న డిమాండ్ దృష్టిలో పెట్టుకొని టికెట్ ధరలు విపరీతంగా పెంచారు. మరి ముఖ్యంగా ఓ సామాన్య మధ్య తరగతి కుటుంబీకుడు మొదటి ఐదు రోజుల వరకు సినిమా చూడాలి అన్న కుదిరే అవకాశం లేని విధంగా టికెట్ రేట్లు భయపెడుతున్నాయి. పుష్ప 2 సినిమా ఒక్క టికెట్టు ఎనిమిది వందల రూపాయలు అదనంగా ప్రకటించడంతో సామాన్యులు సినిమా చూసే అవకాశమే కనిపించడం లేదు.
దీనిపై స్పందించిన పలువురు సీనియర్ జర్నలిస్టులు ఈ విషయంపై కోర్టులో కేసు కూడా దాఖలు చేశారు. ఏది ఏమైనప్పటికీ బెనిఫిట్ షో లతోనే మొత్తం లాభం పొందాలి అని చూస్తున్నట్లు కనిపిస్తోంది ఈ చిత్ర బృందం.ఇక తాజాగా ఈ సినిమా టికెట్ రేట్లు పెంపుపై స్పందించిన బిజెపి ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి ( Rakesh Reddy) అసలు సినిమాని విడుదల చేయొద్దు అంటూ పిలుపునిచ్చారు. నిజానికి సినిమాలో చూపించిందంతా అబద్ధాలే అని పేర్కొన్న ఆయన.. ఈ మూవీ లో 10 లక్షల రూపాయల విలువ చేసే ఎర్రచందనం ధరను కోటి రూపాయలుగా చూపిస్తున్నారని.. దీంతో ప్రభావితులైన యువకులు లక్షల కొద్ది చెట్లను నరికారని పేర్కొన్నారు.
ఇక ఈ నేపథ్యంలో పుష్ప 2 విడుదల అయితే దాని ప్రభావం యువతపై ఎంత దారుణంగా ఉంటుందో ఆలోచించాల్సిందిగా పిలుపునిచ్చారు.. సినిమా అంటే సమాజంలో జరుగుతున్న విషయాలకు అర్థం పట్టేలా ఉండాలి.. మనిషిలో మార్పు తీసుకువచ్చేలా ఉండాలి అంతేకానీ ఇలా యువతను తప్పుదోవ పట్టించేలా ఉండకూడదు అని ఆయన పేర్కొన్నారు. టికెట్ ధర పెంపు పై మాట్లాడుతూ.. 2000 నుంచి 5000 రూపాయల వరకు ఉన్న ఈ టికెట్ ధరలను సామాన్య ప్రజలు ఎలా చూస్తారు అని ప్రశ్నించారు. మీ క్రేజ్ చూపించుకోవడం కోసం ఇలా ధరలు పెంచి ప్రజలను ఇబ్బంది పెట్టడం భావ్యమైన అని మండిపడ్డారు. అంతేకాదు పుష్ప 2 చిత్రం విడుదల తర్వాత ఫారెస్ట్ డిపార్ట్మెంట్ కి ఎక్కడలేని తలనొప్పి రావడం కన్ఫామ్ అని పేర్కొన్నారు.