గుండె ధైర్యం ఎక్కవ కాబట్టే .. ఆ పని చేయలేదు : విష్ణుకుమార్ రాజు
కేంద్ర ప్రభుత్వం గతంలో 7 లక్షల ఇళ్లు కేటాయించిందని బీజేపీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు తెలిపారు. టిడ్కో ఇళ్లపై ఆంధ్రప్రదేశ్ శాసనసభలో స్వల్పకాలిక చర్చ సందర్భంగా విష్ణుకుమార్ రాజు మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మీడియతో మాట్లాడుతూ 5 లక్షల ఇళ్లకు పాలనా ఆమోదం కూడా ఇచ్చారని చెప్పారు. జగన్ దుర్మార్గంగా 2.3 లక్షల టిడ్కో ఇళ్లను వద్దని రద్దు చేశారని తెలిపారు. వైసీపీ ప్రభుత్వం రాగానే కాంట్రాక్టర్లకు బిల్లులు నిలిపివేశారని తెలిపారు. కాంట్రాక్టర్‌గా తనకు రావాల్సిన బకాయే రూ.87 కోట్లుగా ఉందని పేర్కొన్నారు. తన లాంటి వ్యక్తి పదిసార్లు ఆత్యహత్య చేసుకోవాలని, గుండె ధైర్యం ఎక్కువ కాబటే ఆ పని చేయలేదని చెప్పారు. కాంట్రాక్టర్లను జగన్ చాలా రకాలుగా ఇబ్బంది పెట్టారని విమర్శించారు. బిల్లులు చెల్లించకపోయినా గుత్తేదారులు పని చేశారని వివరించారు.
Tags :