ASBL Koncept Ambience
facebook whatsapp X

ఎవరీ నవ్య హరిదాస్..? ప్రియాంకపై ఆమెనే ఎందుకు బీజేపీ పోటీ పెట్టింది..?

ఎవరీ నవ్య హరిదాస్..? ప్రియాంకపై ఆమెనే ఎందుకు బీజేపీ పోటీ పెట్టింది..?

కేరళలోని వయనాడ్ లోక్ సభ స్థానం పేరుచెప్పగానే ముందుగా మనకు గుర్తొచ్చేది గతంలో అది కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ ప్రాతినిథ్యంవహించిన స్థానం. రాహుల్ ఇబ్బందుల్లో ఉన్నప్పుడు అక్కడిప్రజలు అక్కున చేర్చుకుని, తమ హృదయాల్లో నిలుపుకున్నారు. వరుసగా గెలిపించారు. రాజకీయంగా అండగా నిలిచారు. అందుకే తాను ఆ స్థానాన్ని వదులుకున్న సమయంలో.. తన సోదరి ప్రియాంకను అక్కడి నుంచి పోటీకి పెడుతున్నట్లు ప్రకటించారు రాహుల్. ఇప్పుడు ఆస్థానం కాంగ్రెస్ కు అంతముఖ్యంగా మారింది. అలాంటి స్థానంలో ప్రియాంక గాంధీపై పోటీగా నవ్య హరిదాస్ పేరును ప్రకటించింది బీజేపీ.

నవ్య హరిదాస్ వెర్సస్ ప్రియాంక

బీజేపీలో డైనమిక్ లీడర్‌గా నవ్య హరిదాస్ పేరు తెచ్చుకున్నారు. వృత్తిరీత్యా మెకానికల్ ఇంజనీర్ అయిన నవ్య హరిదాస్ 2007లో బీటెక్ పూర్తి చేసారు. కోజికోడ్ కార్పొరేషన్‌కు రెండుసార్లు కౌన్సిలర్‌‌గా ఉన్నారు. కార్పొరేషన్‌లో బీజేపీ పార్లమెంటరీ పార్టీ నేతగా కొనసాగుతున్నారు. బీజేపీ మహిళా మోర్చా రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా సేవలందిస్తున్నారు. 2021లో జరిగిన కోజికోడ్ సౌత్ నియోజవర్గం అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీయే అభ్యర్థిగా ఆమె పోటీ చేశారు.

నవ్య హరిదాస్ రియాక్షన్

వయనాడ్ లోక్‌సభ స్థానానికి బీజేపీ అభ్యర్థిగా ఎంపిక చేయడంపై నవ్య హరిదాస్ స్పందించారు. వయనాడ్ ప్రజలతో మేకమయ్యే వ్యక్తిగా తనను పార్టీ అధిష్ఠానం ఎంపిక చేయడం సంతోషంగా ఉందన్నారు. చుట్టపుచూపుగా వయనాడ్‌కు వచ్చే వారు కాకుండా, ప్రజలతో ఉండి, వారి సమస్యలను అవగాహన చేసుకుని, పరిష్కరించేందుకు ప్రయత్నించే వ్యక్తే వయనాడ్‌కు కావాలన్నారు. బీజేపీ ఆలోచన కూడా ఇదేనన్నారు. వయనాడ్‌ అభివృద్ధికి ప్రజలతో కలిసి పనిచేసేందుకు, వారి సమస్యలను పార్లమెంటు దృష్టికి తెచ్చేందుకు పని చేస్తానని చెప్పారు.

 

 

 

praneet praneet praneet ASBL Radhey Skye Radha Spaces
Tags :