ASBL Koncept Ambience
facebook whatsapp X

ప‌వ‌న్ కోసం స్పెష‌ల్ బ్లూ మ్యాట్

ప‌వ‌న్ కోసం స్పెష‌ల్ బ్లూ మ్యాట్

ఆంధ్ర‌లో వ‌చ్చిన వ‌ర‌ద విప‌త్తు వ‌ల్ల ప‌వ‌న్ క‌ళ్యాణ్ మూవీ షెడ్యూల్ మొత్తం తారుమారైపోయింది. లేక‌పోతే ఇప్ప‌టికే పవ‌న్ సినిమాల‌తో బిజీ అయ్యేవాడు. ఇప్పుడు ప‌రిస్థితి అదుపులోకి రావ‌డంతో ప‌వ‌న్ షూటింగ్ కు రెడీ అవుతున్న‌ట్లు తెలుస్తోంది. అన్నిటికంటే ముందుగా హ‌రిహ‌ర వీర‌మ‌ల్లు షూటింగ్‌కే ప‌వ‌న్ హాజ‌ర‌య్యే అవ‌కాశాలు క‌నిపిస్తున్నాయి.

ఇందులో భాగంగానే వీర‌మ‌ల్లు టీమ్ విజ‌య‌వాడ ప‌రిసరాల్లో స్పెష‌ల్ గా బ్లూ మ్యాట్‌ను రెడీ చేస్తున్నార‌ట‌. ఇప్ప‌టికే సెట్ నిర్మాణం దాదాపు పూర్తైంద‌ని, ఈ నెల మూడో వారం నుంచి మిగిలిన టీమ్ తో షూటింగ్ నిర్వ‌హించాల‌ని చూస్తున్నార‌ట‌. షూటింగ్ మొద‌లైన కొన్ని రోజుల్లోనే ప‌వ‌న్ కూడా జాయిన్ అవుతాడ‌ని తెలుస్తోంది.

అయితే మొద‌ట్లో వీర‌మ‌ల్లు కోసం ప‌వ‌న్ సుమారు రెండు నెల‌లు కేటాయించాల‌న్నారు కానీ ప‌వ‌న్ ఈ సినిమా కోసం కేవ‌లం 20 రోజులు కేటాయిస్తే ఆయ‌న పార్ట్ షూటింగ్ పూర్త‌వుతుంద‌ట‌. ఆ త‌ర్వాత ఈ సినిమా నుంచి ప‌వ‌న్ రిలీవ్ అయిపోవ‌చ్చ‌ని డైరెక్ట‌ర్ జ్యోతి కృష్ణ‌, ప‌వ‌న్ కు హామీ ఇచ్చాడ‌ట‌. దీనిపై ప‌వ‌న్ సానుకూలంగా స్పందించి దానికి త‌గ్గ ఏర్పాట్లు చేసుకుని రెడీగా ఉండ‌మ‌ని వీర‌మ‌ల్లు టీమ్‌కు సూచించాడ‌ట‌. అంతా అనుకున్న‌ట్లు జ‌రిగితే నెక్ట్ ఇయ‌ర్ ఫ‌స్టాఫ్ లోనే హ‌రిహ‌ర వీర‌మ‌ల్లు థియేట‌ర్ల‌లోకి వ‌చ్చే ఛాన్సులున్నాయి.  

 

 

 

praneet praneet praneet ASBL Radhey Skye Radha Spaces
Tags :