ASBL NSL Infratech

వ‌రుస ఆఫ‌ర్ల‌తో బిజీ అయిన బాబీ డియోల్

వ‌రుస ఆఫ‌ర్ల‌తో బిజీ అయిన బాబీ డియోల్

 

రెండేళ్ల క్రితం వ‌ర‌కు బాబీ డియోల్ కు పెద్ద‌గా డిమాండ్ లేదు. ఏదో వ‌చ్చిన వెబ్ సిరీస్, ఇండిపెండెంట్ సినిమాల‌ను చేసిన‌ప్ప‌టికీ అవేమీ ఆయ‌న కెరీర్ కు పెద్ద‌గా ఉప‌యోగ‌పడింది లేదు. కానీ యానిమ‌ల్ సినిమా ఆయ‌న జీవితాన్నే మార్చేసింది. అప్ప‌టివ‌ర‌కు బాబీ డియోల్ కు రూ.4 కోట్లు ఇవ్వ‌డ‌మే ఎక్కువ‌నే  వాళ్లు ఆ సినిమా త‌ర్వాత దానికి డ‌బుల్ ఇస్తామ‌న్నా ఆయ‌న డేట్స్ దొర‌క‌ని ప‌రిస్థితికి ఎదిగాడు.

యానిమ‌ల్ త‌ర్వాత బాబీ డియోల్ సౌత్ తో పాటూ నార్త్ నుంచి కూడా వ‌రుస ఆఫ‌ర్లు అందుకుంటున్నారు. సూర్య హీరోగా తెర‌కెక్కుతున్న కంగువ సినిమా ద్వారా త‌మిళ ఆడియ‌న్స్ కు ప‌రిచ‌యం కానున్నాడు బాబీ డియోల్. ప‌వ‌న్ క‌ళ్యాణ్ హీరోగా న‌టిస్తున్న హ‌రిహ‌ర వీర‌మ‌ల్లు లో ఏకంగా ఔరంగ‌జేబు పాత్ర‌ను ద‌క్కించుకున్నాడు.

ఇవి కాకుండా బాబీ- బాల‌య్య కాంబోలో వ‌స్తున్న ఎన్బీకే109లో విల‌న్ గా న‌టిస్తున్నాడు బాబీ. బాలీవుడ్ లో య‌ష్ రాజ్ ఫిల్మ్స్ బ్యాన‌ర్ లో ఆలియా భ‌ట్, శార్వ‌రి వాఘ్ తో తీస్తున్న లేడీ స్పై సినిమాలో బాబీనే విల‌న్. మోహ‌న్ లాల్ ఒప్పం హిందీ రీమేక్ లో కూడా ఆఫ‌ర్ అందుకున్నాడు. ఇవి కాకుండా అనురాగ్ క‌శ్య‌ప్ తెర‌కెక్కిస్తున్న సినిమాలో కూడా ఛాన్స్ కొట్టేశాడు బాబీ డియోల్. ఎన్ని ఆఫ‌ర్లొస్తున్నా త‌న ప్రియారిటీ మాత్రం తెలుగు త‌మిళ సినిమాల మీదే పెట్టినట్లు తెలుస్తోంది. రెమ్యూన‌రేష‌న్స్ తో పాటూ నిర్మాత‌లు క‌మిట్‌మెంట్ తో ఉండ‌టమే దీనికి కార‌ణం.

 

 

 

 

praneet praneet praneet obili-garuda Vertex poulomi Png-jewelry
Tags :