ASBL Koncept Ambience
facebook whatsapp X

మ‌రో క్రేజీ ప్రాజెక్టులో బాబీ డియోల్

మ‌రో క్రేజీ ప్రాజెక్టులో బాబీ డియోల్

యానిమ‌ల్(Animal) సినిమాలో న‌టించిన ప్ర‌తీ ఒక్క‌రూ ఆ సినిమా వ‌ల్ల ఎంతో లాభ‌ప‌డ్డారు. ర‌ణ్‌బీర్ క‌పూర్(Ranbir Kapoor), సందీప్ రెడ్డి(Sandeep Reddy Vanga) వంగా మంచి హిట్ అందుకుని త‌మ రేంజ్ ను పెంచుకుంటే త్రిప్తి డిమ్రి(Tripthi Dimri), అనిల్ క‌పూర్(Anil Kapoor) కు యానిమ‌ల్ మంచి జోష్ ఇచ్చింది. యానిమ‌ల్ సినిమా వ‌ల్ల అందులో విల‌న్ గా న‌టించిన బాబీ డియోల్(Booby Deol) పొందిన ప్ర‌యోజ‌నం మాత్రం ఎవ‌రూ ఊహించ‌లేదు.

యానిమ‌ల్ కు ముందు బాబీ డియోల్ ను అంద‌రూ మ‌ర్చిపోయారు. హీరోగానే కాదు క్యారెక్ట‌ర్, విల‌న్ పాత్ర‌లు కూడా ఆయ‌న‌కు రాలేదు. అలాంటి టైమ్ లో సందీప్ రెడ్డి వంగా యానిమ‌ల్‌లో ఛాన్స్ ఇచ్చాడు. యానిమ‌ల్ లో బాబీ పాత్ర‌కు సినిమా రిలీజ్ త‌ర్వాత మంచి మార్కులు ప‌డ్డాయి. ఈ నేప‌థ్యంలో బాబీ కెరీర్ ఊహించ‌ని మ‌లుపు తిరిగింది.

ప్ర‌స్తుతం బాబీ దేశంలోనే బిజీయెస్ట్ విల‌న్ గా మారాడు. ఇప్ప‌టికే తెలుగులో బాల‌య్య‌(Balayya)- బాబీ(Bobby) కాంబోలో వ‌స్తున్న సినిమా విల‌న్ పాత్ర చేస్తున్నాడు. హ‌రిహ‌ర వీర‌మ‌ల్లు(Harihara Veeramallu)లో కూడా బాబీ డియోల్ కీల‌క పాత్ర‌లో న‌టిస్తున్నాడు. కంగువ‌లో(Kanguva) బాబీనే విల‌న్. ఇవి కాకుండా బాలీవుడ్ మూవీ ఆల్ఫా(Alpha)లో విల‌న్ గా సెలెక్ట్ అయ్యాడు. అనురాగ్ క‌శ్య‌ప్(Anurag Kashyap) కొత్త సినిమాలోనూ ఛాన్స్ కొట్టేశాడు. దీంతో పాటూ ఇప్పుడు తాజాగా కోలీవుడ్ స్టార్ హీరో విజయ్(Vijay) పాలిటిక్స్ లో వెళ్లేముందు చివ‌ర‌గా చేయ‌నున్న సినిమాలో కూడా బాబీ డియోల్ విల‌న్ పాత్ర చేయ‌బోతున్న‌ట్లు తెలుస్తోంది.  బాబీ డియోల్ ఏ ముహూర్తాన యానిమ‌ల్ కు సైన్ చేశాడో కానీ అప్ప‌ట్నుంచి ఆయ‌న‌కు వ‌రుస‌పెట్టి ఆఫ‌ర్లు వ‌స్తున్నాయి.  

 

 

praneet praneet praneet ASBL Radhey Skye Radha Spaces
Tags :