ASBL NSL Infratech

క‌ల్కిని త‌క్కువ చేస్తున్న బాలీవుడ్ మీడియా

క‌ల్కిని త‌క్కువ చేస్తున్న బాలీవుడ్ మీడియా

బాహుబ‌లి సినిమా రిలీజ్ టైమ్ లో బాలీవుడ్ మీడియా చేసిన హంగామా అంతా ఇంతా కాదు. ఒక సినిమాను మీడియా ఏ రేంజ్ లో పుష్ చేయ‌గ‌ల‌దో బాలీవుడ్ మీడియా అంతా చేసింది. కానీ బాహుబ‌లి త‌ర్వాత వ‌చ్చిన భారీ బాలీవుడ్ సినిమాలు పెద్ద‌గా ఆడ‌క‌పోవ‌డంతో నార్త్ ఆడియ‌న్స్ అక్క‌డి సినిమాల మీద ఇంట్రెస్ట్ కోల్పోయారు.

అదే టైమ్ లో వ‌చ్చిన పుష్ప‌, ఆర్ఆర్ఆర్, కార్తికేయ‌2, హ‌నుమాన్ లాంటి తెలుగు సినిమాలు హిందీలో బాగా ఆడ‌టంతో బాలీవుడ్ వాళ్లు తెలుగు సినిమాలపై అసూయ ప‌డుతున్నారు. అందుకే ఈ మ‌ధ్య తెలుగు సినిమాల‌ను వాళ్లు అస‌లు ఎలివేట్ చేయక‌పోవ‌డం మానేసి వాటి స్థాయిని త‌గ్గించాల‌ని ప్ర‌య‌త్నిస్తున్నారు.

ముఖ్యంగా ప్ర‌భాస్ సినిమాల‌ను మ‌రీ టార్గెట్ చేస్తున్నారు. స‌లార్ సినిమాను ఎంతగా ఎటాక్ చేశారో ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు కానీ ఆ సినిమా హిందీలో మాస్ ఆడియ‌న్స్ ను ఓ రేంజ్ లో అల‌రించింది. ఇక ప్ర‌భాస్ రీసెంట్ మూవీ క‌ల్కి కి కూడా క్రిటిక్స్ త‌క్కువ రేటింగ్స్ ఇవ్వ‌డ‌మే కాకుండా సినిమా గురించి ఎక్కువ‌గా నెగిటివ్ కామెంట్స్ హైలైట్ అయ్యేలా మాట్లాడారు. క‌లెక్ష‌న్స్ కూడా ఫేక్ అని ప్ర‌చారం చేశారు. కానీ అవేవీ క‌ల్కి మీద ఎఫెక్ట్ చూప‌లేక‌పోయాయి. మాస్ సెంట‌ర్స్ లో క‌ల్కి అదిరిపోయే క‌లెక్ష‌న్ల‌తో దూసుకెళ్తుంది. నార్త్ బెల్ట్ లో ప్ర‌భాస్ క్రేజ్, మార్కెట్ ఇంకా అలానే ఉంద‌ని క‌ల్కి మ‌రోసారి ప్రూవ్ చేసింది.  

 

 

praneet praneet praneet obili-garuda Vertex poulomi Png-jewelry
Tags :