ASBL Koncept Ambience
facebook whatsapp X

పాన్ ఇండియా ప‌ల్స్ ను ప‌ట్టేసిన బోయ‌పాటి

పాన్ ఇండియా ప‌ల్స్ ను ప‌ట్టేసిన బోయ‌పాటి

బాహుబ‌లి(baahubali) సినిమా త‌ర్వాత పాన్ ఇండియా(pan India) అనే ప‌దం చాలా ఫేమ‌స్ అయింది. ఆ పేరుతో త‌ర్వాత చాలా సినిమాలొచ్చాయి కానీ నిజంగా పాన్ ఇండియా స్థాయిలో ఆడియ‌న్స్ ను మెప్పించిన సినిమాలు మాత్రం చాలా త‌క్కువ‌. కొన్ని సినిమాలు పాన్ ఇండియా పై పెద్ద‌గా ఫోక‌స్ చేయ‌క‌పోయినా మంచి విజ‌యం సాధించిన‌వి ఉన్నాయి.

అవే కేజీఎఫ్(KGF), పుష్ప‌(Pushpa), కాంతార‌(Kaanthara), కార్తికేయ‌2(Karthikeya2). వీటిలో కాంతార‌, కార్తికేయ‌2 పాన్ ఇండియా స్థాయిలో హిట్ అవ‌డం చూసి మొద‌ట్లో అంద‌రూ ఆశ్చ‌ర్య‌పోయారు. అయితే ఈ రెండు సినిమాల‌కు క‌లిసొచ్చిన అంశం ఆ క‌థ‌లు దేవుళ్లు, హిందూ సంస్కృతితో ముడిప‌డి ఉండ‌ట‌మే. అలాంటి సినిమాల‌ను ఆడియ‌న్స్ ఇప్పుడు ఎక్కువ‌గా ఆద‌రిస్తున్నారు.

భాష‌తో సంబంధం లేకుండా ఆ సినిమాల‌కు మంచి ఆద‌ర‌ణ ద‌క్కుతుంది. అందుకే ఈ మ‌ధ్య ఎక్కువ సినిమా క‌థ‌ల్లో ఈ అంశాల‌ను జోడిస్తున్నారు. ఇక టాలీవుడ్ లో రీసెంట్ గా స్టార్ట్ అయిన అఖండ‌2(Akhanda2) అనౌన్స్‌మెంట్ వీడియో చూస్తే బోయ‌పాటి(Boyapati Srinu) కూడా ఈ పాన్ ఇండియా ట్రెండ్ ను బాగానే ప‌ట్టేసిన‌ట్లు అనిపిస్తోంది. అఖండ(Akhanda) సినిమాను కేవ‌లం తెలుగులో మాత్ర‌మే తీసిన బోయ‌పాటి ఇప్పుడు అఖండ‌2ను పాన్ ఇండియా స్థాయిలో తెర‌కెక్కించ‌బోతున్నాడు. ఈ సినిమాలో హీరో దైవాంశ సంభూతుడిగా క‌నిపిస్తాడు. ఇందులో దేవుడి గురించి, హింది సంస్కృతి గురించి ప‌వ‌ర్‌ఫుల్ డైలాగ్స్ ఉండ‌నున్నాయి. ఇవ‌న్నీ నార్త్ ఆడియ‌న్స్ కు బాగా న‌చ్చుతాయ‌నే ఉద్దేశంతోనే బోయ‌పాటి అఖండ‌2ను పాన్ ఇండియా లెవెల్ లో తెర‌కెక్కిస్తున్నాడు.  

 

 

 

 

praneet praneet praneet ASBL Radhey Skye Radha Spaces
Tags :