ASBL Koncept Ambience
facebook whatsapp X

బోయ‌పాటికి ఈసారైనా బ‌డ్జెట్ స‌రిపోతుందా?

బోయ‌పాటికి ఈసారైనా బ‌డ్జెట్ స‌రిపోతుందా?

ఒక‌ప్ప‌టిలా ఇప్పుడు మాస్ క‌మ‌ర్షియ‌ల్ డైరెక్ట‌ర్లు హిట్లు కొట్టలేకపోతున్నారు. అప్ప‌ట్లో ఈ ఫార్మాట్ లో హిట్ కొట్ట‌క‌పోయినా న‌ష్టాలు రాకుండా సేఫ్ అయ్యేవారు. కానీ ఇప్పుడు ఫ‌లితంలో కాస్త తేడా కొట్టినా ఆడియెన్స్ అంచ‌నాల‌ను అందుకోలేక డిజాస్ట‌ర్లవుతున్నాయి. అయితే బోయ‌పాటి(boyapati srinu) మాత్రం ఇదే ట్రాక్ లో వెళ్తూ బాల‌య్య‌తో హిట్లు అందుకుంటున్నాడు.

బోయ‌పాటి వేరే హీరోతో చేసిన‌ప్పుడు ఈ ఫార్ములా వ‌ర్క‌వుట్ అవ‌క‌పోయినా బాల‌య్య‌(Bala krishna)తో మాత్రం 100% స్ట్రైక్ రేట్ ఉంది. దీంతో ఇప్పుడు వీరిద్ద‌రి కాంబినేష‌న్ లో వ‌స్తున్న అఖండ2(akhanda2)పై భారీ అంచ‌నాలున్నాయి. అయితే బోయ‌పాటి మొద‌టి నుంచి ప‌ర్ఫెక్ష‌న్ కోసం ఎక్కువ ఖ‌ర్చు చేసి బ‌డ్జెట్ విష‌యంలో ట్విస్టులిస్తాడ‌నే పేరుంది. దీంతో ప్ర‌తీసారి ఆయ‌న పారితోషికంలో కటింగ్స్ కూడా ప‌డుతున్నాయి.

అఖండ(akhanda) టైమ్ లో అయితే అస‌లు రెమ్యూన‌రేష‌నే లేకుండా ప్రాఫిట్ లో షేర్ తీసుకుంటాన‌ని మాట్లాడుకున్నాడు. అయిన‌ప్ప‌టికీ సినిమాకు అనుకున్న దానికంటే ఎక్కువే ఖ‌ర్చ‌యింది. ఆ సినిమా హిట్ అయింది కాబ‌ట్టి స‌రిపోయింది కానీ లేదంటే ప‌రిస్థితి వేరేలా ఉండేది. ఇప్పుడు అఖండ‌2 కోసం ఏకంగా రూ.100 కోట్లు ఖ‌ర్చు పెడుతున్న‌ట్లు టాక్. బాల‌య్య(Balaiah) కెరీర్లోనే హ‌య్యెస్ట్ బ‌డ్జెట్ తో రూపొందుతున్న ఈ సినిమానైనా బోయ‌పాటి అనుకున్న బ‌డ్జెట్ లో పూర్తి చేస్తాడా లేదా అనేది ఇప్పుడు ప్ర‌శ్న‌గా మారింది. కానీ ఈసారి నిర్మాత బాల‌య్య కూతురు కాబ‌ట్టి బాల‌య్య కూడా బ‌డ్జెట్ విష‌యంలో ఇన్వాల్వ్ అయ్యే ఛాన్సుంది.  

 

 

praneet praneet praneet ASBL Radhey Skye Radha Spaces
Tags :