కాంగ్రెస్ కు వన్ మంత్ డెడ్ లైన్.. బీఆర్ఎస్ వార్ స్ట్రాటజీ రెడీ..
వన్ మంత్.. కేవలం వన్ మంత్.. తర్వాత రఫ్పాడిస్తామంటోంది బీఆర్ఎస్.. ఇచ్చిన ఆరు గ్యారెంటీలపై నిగ్గదీసి కడిగేస్తామంటోంది. కాంగ్రెస్ ప్రభుత్వానికి సంవత్సరం గడువిచ్చామని.. ఆ గడువు మరో నెలతో పూర్తవుతుందని.. ఆతర్వాత సమస్యలపై సమరమే అంటోంది.వన్ ఇయర్ ప్రొటెస్ట్ దద్దరిల్లిపోవాల్సిదేనంటోంది బీఆర్ఎస్. ఎప్పటికప్పుడు ప్రభుత్వ వైఫల్యాలపై గళ మెత్తుతూనే..కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి ఏడాది అయిన సందర్భంగా..పెద్ద ఎత్తున నిరసనకు రెడీ అవుతోంది. ఇచ్చిన హామీలేంటి.? అమలు చేసిందేంటి.? అంటూ అధికార కాంగ్రెస్‌ను నిలదీసేందుకు..భారీ కార్యక్రమానికి ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది.
అప్పటి నుంచి దద్దరిల్లిపోవాల్సిందేనంటోంది బీఆర్ఎస్…
ఇటీవలి కాలంలో బీఆర్ఎస్ టోన్ పెంచింది. ప్రజాసమస్యలను అస్త్రాలుగా మలచుకుని, కాంగ్రెస్ పై విరుచుకుపడుతోంది. ఓవైపు సీఎం రేవంత్ రెడ్డి.. ఎక్కడికక్కడ బీఆర్ఎస్ ను అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నా.. గులాబీ నేతలు మాత్రం ఎక్కడా ఆగడం లేదు.అధికార పార్టీ వైఫల్యాలపై మరింత బలంగా పోరాడాలని ఫిక్స్ అయినట్లు తెలుస్తోంది. ఆందోళనలు, సభలు, సమావేశాలతో ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టే ప్లాన్ చేస్తోంది.
ఆరు గ్యారెంటీలు.. 420 హామీల కథేంటని ఇప్పటికే..అధికార పార్టీని కార్నర్ చేస్తోంది బీఆర్ఎస్. ఓవైపు కేటీఆర్..మరోవైపు హరీశ్‌రావు..పార్టీ ఎమ్మెల్యేలు ప్రెస్ మీట్లు పెడుతూ ఎప్పటికప్పుడు ప్రభుత్వ వైఫల్యాలపై గళం వినిపిస్తున్నారు. అయితే పూర్తిస్థాయి ఆందోళనలకు బీఆర్ఎస్ రెడీ అవుతోన్నట్లు తెలుస్తోంది. రుణమాఫీ, 4 వేల పెన్షన్, మహిళలకు నెలకు 2500, ఉద్యోగాల భర్తీపై గట్టిగనే పోరాడాలని ఫిక్స్ అయినట్లు సమాచారం.. డిసెంబర్ 7నాటికి రేవంత్ సర్కార్ ఏర్పడి ఏడాది అవుతుందని అప్పటి నుంచి అసలు సీన్ ఏంటో చూపిస్తామంటున్నారు గులాబీ నేతలు. బాస్ కూడా రంగంలోకి దిగుతారని..అప్పుడు అధికార కాంగ్రెస్‌కు ఆందోళనల రుచేంటో చూపిస్తామంటున్నారు.
సంవత్సరీకం పేరుతో సభ నిర్వహించాలన్న యోచన..
ప్రజల సమస్యలపై ప్రజాక్షేత్రంలోనే ఉండేందుకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తోంది బీఆర్ఎస్. 11 నెలలుగా ప్రభుత్వంపై విమర్శలు గుప్పిస్తున్న గులాబీ పార్టీ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటై ఏడాది పూర్తి చేసుకున్న సందర్భంగా ఓ వినూత్న కార్యక్రమాన్ని చేపట్టేందుకు రెడీ అవుతున్నట్లు సమాచారం. ఏడాది కాలంలో ప్రభుత్వ వైఫల్యాలను ఎత్తిచూపుతూ సంవత్సరీకం పేరుతో సభ నిర్వహించాలన్న యోచనలో గులాబీ పార్టీ ఉన్నట్లు తెలుస్తోంది. ప్రభుత్వ వైఫల్యాలపై ప్రత్యేకంగా పాటలు కూడా సిద్ధం చేయిస్తున్నట్లు సమాచారం. మాజీ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ ఆధ్వర్యంలో సాంస్కృతిక బృందం పాటల రూపకల్పనలో నిమగ్నమై ఉన్నట్లు తెలుస్తోంది.
సోషల్ మీడియా వేదికల ద్వారా ప్రచారం..
ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు..వాటి అమలు, ప్రభుత్వం తీరును ప్రజల్లోకి తీసుకెళ్లేలా ప్లాన్ రెడీ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఉద్యమ సమయంలో మాదిరిగానే ఇప్పుడు కూడా సాంస్కృతిక బృందాలతో ప్రత్యేకంగా వీడియోలు రూపొందించే పనిలో గులాబీ నేతలు ఉన్నట్లు చెబుతున్నారు. షార్ట్ ఫిలిమ్స్ రూపొందించి ప్రభుత్వం ఏయే రంగాల్లో విఫలమైందో వివరించే ప్రయత్నం చేస్తున్నారట. బీఆర్ఎస్ హయాంలో వ్యవసాయం రంగం ఎలా ఉండే..ఇప్పుడెలా ఉంది.? ఐటీ పరిస్థితి ఏంటి.? ప్రభుత్వ పథకాల అమలు ఎలా ఉంది.? రియల్ ఎస్టేట్, కన్‌స్ట్రక్షన్ ఫీల్డ్‌లో ప్రభుత్వ వైఫల్యాలు ఎలా ఉన్నాయి..ఇలా అన్ని అంశాలు ప్రజలకు అర్థమయ్యేలా సోషల్ మీడియా వేదికల ద్వారా ప్రచారం చేయడానికి సిద్ధమవుతోంది.