దాన్ని నెరవేర్చిన తర్వాతే.. స్థానిక సంస్థల ఎన్నికలకు
ప్లానింగ్ కమిషన్, బీసీ కమిషన్‌పై ప్రభుత్వం 2 జీవోలు మాత్రమే ఇచ్చిందని మాజీ మంత్రి, బీఆర్‌ఎస్ నేత శ్రీనివాస్ గౌడ్ అన్నారు. తెలంగాణ భవన్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ బీసీ రిజర్వేషన్లపై చట్టం చేస్తే సహకరిస్తామన్నారు. చట్టం లేకుండా రిజర్వేషన్లు పెరగవని పేర్కొన్నారు. బిహార్, మహారాష్ట్రలో రిజర్వేషన్ల పెంపును కోర్టులు కొట్టేశాయని గుర్తు చేశారు. బీసీ కమిషన్ జిల్లాలకు పోతే ఎవరూ పట్టించుకోవడం లేదు. కమిషన్‌ను అవమానించిన అధికారులపై చర్యలు తీసుకోవాలి. బీసీ రిజర్వేషన్లు పెంచుతామని హామీ ఇచ్చే కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. దాన్ని నెరవేర్చిన తర్వాతే స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్లాలి. ఈ అంశంపై అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేయాలని అన్నారు.
Tags :