ASBL Koncept Ambience
facebook whatsapp X

ఎమ్మెల్యేల ఫిరాయింపుల కేసుపై ముగిసిన హైకోర్టు విచారణ.. తీర్పు రిజర్వ్!

ఎమ్మెల్యేల ఫిరాయింపుల కేసుపై ముగిసిన హైకోర్టు విచారణ.. తీర్పు రిజర్వ్!

తెలంగాణలో ఎమ్మెల్యేల ఫిరాయింపులపై వేసిన పిటిషన్‌పై విచారణ హైకోర్టులో ముగిసింది. ఈ కేసులో తీర్పును రిజర్వ్ చేస్తున్నట్లు హైకోర్టు ధర్మాసనం వెల్లడించింది. ఎమ్మెల్యేల ఫిరాయింపులపై సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పుపై అసెంబ్లీ కార్యదర్శి అప్పీల్‌కు వెళ్లిన సంగతి తెలిసిందే. ఈ అప్పీల్‌పై హైకోర్టు సీజే ధర్మాసనం విచారణ చేపట్టింది. ఇరువైపు వాదనలు విన్న సీజే ధర్మాసనం తీర్పును మంగళవారం నాడు రిజర్వ్ చేసింది. ఈ కేసులో బీఆర్ఎస్ తరఫున వాదనలు వినిపించిన సీనియర్ న్యాయవాది మోహన్ రావు.. సింగిల్ జడ్జి తీర్పుపై అప్పీల్ చేసే అర్హత అసెంబ్లీ కార్యదర్శికి లేదని వాదించారు. ఈ పిటిషన్ అసలు విచారణకు అర్హతే లేనిదని తెలిపారు. అనర్హత పిటిషన్లపై స్పీకర్ సకాలంలో నిర్ణయం తీసుకోవాల్సిందేనని డిమాండ్ చేశారు. ఇరువైపు వాదనలు విన్న సీజే ధర్మాసనం... విచారణ ముగిసిందని తెలిపింది.

 

 

praneet praneet praneet Koncept Ambience Radhey Skye Radha Spaces
Tags :