ASBL Koncept Ambience
facebook whatsapp X

స్పీకర్‌ నిర్ణయం తీసుకోకపోతే... సుప్రీంకోర్టును ఆశ్రయిస్తాం

స్పీకర్‌ నిర్ణయం తీసుకోకపోతే... సుప్రీంకోర్టును ఆశ్రయిస్తాం

ఫిరాయింపు ఎమ్మెల్యే అనర్హత పిటిషన్లపై శాసనసభాపతి నిర్ణయం తీసుకోకపోతే సుప్రీంకోర్టును ఆశ్రయిస్తామని బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌  కేటీఆర్‌ తెలిపారు. అనర్హత పిటిషన్ల విషయమై హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి నేతృత్వంలోని బెంచ్‌ తీర్పుపై కేటీఆర్‌  స్పందించారు. మొన్నటి వరకు సభాపతిని ఆదేశించే అధికారం కోర్టుకు లేదని వాదించారని కేటీఆర్‌ గుర్తు చేశారు. రీజనబుల్‌ పీరియడ్‌లో నిర్ణయం తీసుకోవాలని హైకోర్టు సీజే స్పష్టం చేశారని, రీజనబుల్‌  పీరియడ్‌ అంటే మూడు నెలలు అని మణిపుర్‌ కేసులో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పులో స్పష్టంగా ఉందని కేటీఆర్‌ పేర్కొన్నారు.
 

 

 

praneet praneet praneet Koncept Ambience Radhey Skye APR Group
Tags :