ASBL NSL Infratech
facebook whatsapp X

రివ్యూ : అక్కడక్కడా నవ్వించిన  'బడ్డీ'  

రివ్యూ : అక్కడక్కడా నవ్వించిన  'బడ్డీ'  

తెలుగు టైమ్స్.నెట్ రేటింగ్ : 2.25/5
నిర్మాణ సంస్థ : స్టూడియో గ్రీన్ ఫిలింస్
నటీనటులు: అల్లు శిరీష్, గాయత్రి భరద్వాజ్, అజ్మల్ అమీర్, ప్రిషా రాజేష్ సింగ్
సంగీత దర్శకుడు: హిప్ హాప్ తమిళా, సినిమాటోగ్రఫీ: కృష్ణన్ వసంత్
ఎడిట‌ర్ : రూబెన్, నిర్మాతలు : కే ఈ జ్ఞానవేల్ రాజా
దర్శకులు: సామ్ ఆంటోన్
విడుదల తేదీ :02.08.2024

అల్లు వారి యంగ్ హీరో శిరీష్ కొంత గ్యాప్ తీసుకొని చేసిన లేటెస్ట్ చిత్రమే “బడ్డీ”. తమిళ్ నిర్మాత కే ఈ జ్ఞానవేల్ రాజా నిర్మించిన ఈ చిత్రం ట్రైలర్ టీజర్ లతో మంచి ఆసక్తి రేపిన ఈ ఇంట్రెస్టింగ్ థ్రిల్లర్ నేడు థియేటర్స్ లోకి వచ్చింది. మరి ఈ చిత్రం ఎలా ఉందో సమీక్షలో చూద్దాం రండి.

కథ:

వైజాగ్ లో పైలెట్ గా ఆదిత్య రామ్ (అల్లు శిరీష్) వర్క్ చేస్తుంటాడు. అలాగే తనతో పాటుగా ఎయిర్ కంట్రోల్ కంట్రోలర్ గా పల్లవి (గాయత్రీ భరద్వాజ్) కూడా అక్కడే పని చేస్తుంది. ఇలా ఆదిత్య ప్రేమలో పల్లవి పడుతుంది. కానీ ఆమెకి ఒక ఊహించని సంఘటన మూలాన ఆమె కిడ్నాప్ చెయ్యబడుతుంది. ఈ సమయంలో ఆమె ఆత్మ ఓ టెడ్డి బేర్ లోకి ప్రవేశిస్తుంది. అక్కడ నుంచి ఆ టెడ్డి బేర్ గా మారిన పల్లవి ఏం చేస్తుంది? ఆదిత్యని ఎలా కలుస్తుంది? తనే పల్లవి అని ఆదిత్య నమ్ముతాడా లేదా? పల్లవి బాడీ ఎక్కడ ఉంది? చివరికి టెడ్డి లోనే ఆమె ఆత్మ మిగిలిపోతుందా? ఈ క్రమంలో ఆదిత్య ఏం చేస్తాడు. అనేవి తెలియాలి అంటే ఈ చిత్రాన్ని చూసి తెలుసుకోవాలి.

నటి నటుల హావభావాలు :

ఈ చిత్రంలో అల్లు శిరీష్ తనదైన పెర్ఫామెన్స్ ని కనబరిచాడు. మంచి స్టైలిష్ లుక్స్, ఒక పైలెట్ గా కనిపిస్తూ మంచి నటన అందించాడు అని చెప్పాలి. అలాగే ముఖ్యంగా టెడ్డితో కొన్ని సీన్స్ కానీ తన ప్రేయసిని కాపాడే సన్నివేశాల్లో అల్లు శిరీష్ తన మార్క్ ఈజ్ తో కనిపిస్తాడు. అలాగే తన కామెడీ టైమింగ్ కూడా ఈ చిత్రంలో బాగుంది.ఇక తనకి జోడిగా కనిపించిన నటి గాయత్రీ భరద్వాజ్ డీసెంట్ లుక్స్ తో కనిపిస్తూ మంచి నటన కనబరిచింది. అలాగే ఇద్దరి నడుమ ట్రాక్స్ బాగున్నాయి. వారి కెమిస్ట్రీ ఆన్ స్క్రీన్ బాగుంది. ఆలీ, ముకేష్ రిషి, అజ్మల్ అమీర్ ల పాత్రలు వీక్ క్యారెక్టరైజేషన్ తో అసంపూర్ణంగా అనిపిస్తాయి.

సాంకేతిక వర్గం పనితీరు :

దర్శకుడు సాన్ ఆంటోన్ విషయానికి వస్తే.. తాను ఈ చిత్రానికి సరైన న్యాయం చేయలేకపోయాడు అని చెప్పాలి. ఇంకా ఎంగేజింగ్ గా చెప్పే ఛాన్స్ ఉన్న లైన్ ని చాలా యావరేజ్ స్క్రీన్ ప్లే తో నడిపిస్తాడు. వీటిలో చాలా అంశాలు ఊహించదగిన రేంజ్ లోనే కనిపిస్తూ పెద్దగా ఎగ్జైట్మెంట్ లాంటివి ఏమి లేకుండా చప్పగానే సాగదీసినట్టుగా తాను తెరకెక్కించాడు. సినిమాలో చాలా వరకు విజువల్స్ అసహజంగా కనిపిస్తాయి. వి ఎఫ్ ఎక్స్ వర్క్ చాలా వీక్ గా కనిపిస్తాయి. హిప్ హాప్ తమిళ మ్యూజిక్ పర్వాలేదు అనిపించే రేంజ్ లో ఉంది. రూబెన్ ఎడిటింగ్ ఇంకాస్త బెటర్ గా చేయాల్సింది. కృష్ణన్ వసంత్ ఇచ్చిన విజువల్స్ పర్వాలేదు. ఈ చిత్రంలో నిర్మాణ విలువలు కాన్సెప్ట్ కి కావాల్సిన రేంజ్ లో లేవు.

విశ్లేషణ :

బడ్డీ చిత్రం చాలా విషయాల్లో స్ట్రగుల్ అవుతున్నట్టుగా కనిపిస్తుంది. మెయిన్ గా ప్లాట్ కొంతమందికి కొత్తగా అనిపించవచ్చు కొంతమందికి రొటీన్ గానే అనిపించవచ్చు. ఒక ఆత్మా వచ్చి ఒక బొమ్మలో కలవడం అక్కడ నుంచి సినిమా రన్ అవ్వడం అనేవి చాలా సినిమాల్లోనే చూసేసి ఉంటాం. ఇంకా తమిళ్ లో టెడ్డి సినిమా చూసినవారికి ఈ లైన్ బాగానే తెలిసి ఉంటుంది. మరి తెలుగులో కథనం ప్రకారం కొన్ని మార్పులు చేర్పులు కనిపిస్తాయి కానీ ఇవి పూర్తి స్థాయిలో ఆకట్టుకునే విధంగా సాగలేదు. అలాగే చాలా సీన్స్ లో లాజిక్స్ కూడా కరెక్ట్ గా లేవు. కొన్ని సీన్స్ లో అసందర్భంగా కామెడీ కనిపిస్తుంది. అలాగే చాలా సీన్స్ ని దర్శకుడు బాగా సాగదీసినట్టుగా అనిపిస్తాయి. అలాగే చాలా కామెడీ సీన్స్ కూడా పెద్దగా వర్కౌట్ కాలేదు. ఇక మొత్తంగా చూసినట్టు అయితే ఈ “బడ్డీ” పిల్లలకి నచ్చే కాన్సెప్ట్ లో కనిపిస్తుంది కానీ అన్ని వర్గాల ప్రేక్షకులని ఆకట్టుకోవడంలో విఫలమైంది.  

 

 

praneet praneet praneet ASBL Radhey Skye Radha Spaces
Tags :