మంత్రి శ్రీధర్‌బాబుతో బల్గేరియా రాయబారి డా. నికోలాయ్ భేటీ
తెలంగాణ రాష్ట్రంతో వాణిజ్య, సాంస్కృతిక రంగాల్లో ద్వైపాక్షిక సంబంధాలు నెలకొల్పేందుకు బల్గేరియా ఆసక్తితో ఉందని భారత్‌లో ఆ దేశ రాయబారి డా.నికోలాయ్ యాంకోవ్ అన్నారు. సచివాలయంలో ఆయన తన బృందంతో కలిసి ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్‌బాబుతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా డా.నికోలాయ్ యాంకోవ్ మాట్లాడారు. ఇరు దేశాల మధ్య వాణిజ్య, పారిశ్రామిక పెట్టుబడులకు సంబంధించి ఒక ఉమ్మడి వేదిక ఏర్పాటు చేయాలన్న ఆయన ప్రతిపాదనకు శ్రీధర్ బాబు అంగీకరించారు. నూతన ఆవిష్కరణలు, ఫార్మా, లైఫ్ సైన్సెస్‌లో తమ రాష్ట్రంలో అద్భుతమైన ఎకోసిస్టమ్‌ను అందుబాటులోకి తీసుకొచ్చామని మంత్రి డా.నికోలాయ్‌కు వివరించారు. ఈ సమావేశంలో ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి, ఎమ్మెల్యేలు విజయరమణారావు, మందుల సామేల్, పరిశ్రమల శాఖ కమిషనర్ డా.మల్సూర్, టీజీఐఐసీ సీఈఓ వి.మధుసూదన్, సుచిర్ ఇండియా ఇన్‌ఫ్రా సీఈవో డా.కిరణ్ కుమార్ పాల్గొన్నారు.