ASBL Koncept Ambience
facebook whatsapp X

బ‌న్నీకోసం ప‌క్కా ప్లాన్ ను రెడీ చేసిన‌ త్రివిక్ర‌మ్

బ‌న్నీకోసం ప‌క్కా ప్లాన్ ను రెడీ చేసిన‌ త్రివిక్ర‌మ్

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్(Allu Arjun), సుకుమార్(Sukumar) క‌ల‌యిక‌లో రూపొందుత‌న్న పుష్ప‌2(Pushpa2) రిలీజ్ కు ద‌గ్గ‌ర ప‌డుతుంది. స్పెష‌ల్ సాంగ్ షూటింగ్ త‌ప్ప ఆల్మోస్ట్ మొత్తం పూర్తైన‌ట్టే అంటున్నారు. అయితే పుష్ప‌2 రిలీజ్ అవుతున్నా బ‌న్నీ త‌ర్వాతి సినిమా ఏంటనేది మాత్రం క్లారిటీగా చెప్ప‌డం లేదు. ఇప్ప‌టికే చాలా ఇంట‌ర్వ్యూల్లో నిర్మాత‌ నాగ‌వంశీ(Naga vamsi) త్రివిక్ర‌మ్ తో చేయ‌బోయే సినిమా గురించి ఊరించి చెప్తున్నారు.

కానీ ఆ సినిమా ఎప్పుడు స్టార్ట్ అవుతుంద‌నేది మాత్రం క‌చ్ఛితంగా చెప్ప‌డం లేదు. ఇప్ప‌టికే స్క్రిప్ట్ లాక్ అయిందంటున్నారు. రాజ‌మౌళి(Rajamouli) కూడా ట‌చ్ చేయ‌ని జాన‌ర్ ను త్రివిక్ర‌మ్(Trivikram) చేస్తున్నాడ‌ని తెగ చెప్పేస్తున్నారు. బ‌డ్జెట్ కూడా క‌ల్కి(Kalki), ఆర్ఆర్ఆర్(RRR) ను మించి ఉంటుంద‌ని అంత‌ర్గ‌త స‌మాచారం. ఇవ‌న్నీ ప‌క్క‌న‌పెడితే అస‌లీ సినిమాను బ‌న్నీ(Bunny), త్రివిక్ర‌మ్ ఎంత టైమ్ లో పూర్తి చేయాల‌నుకుంటున్నార‌నేది అస‌లు ప్ర‌శ్న‌.

ఇప్ప‌టికే పుష్ప‌2 కోసం మూడేళ్లు ఖ‌ర్చు చేసిన బ‌న్నీ ఇక‌పై సినిమాల వేగం పెంచాల‌ని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. వాస్త‌వానికి అన్నీ కుదిరితే ఆరు నెలల్లో అట్లీ(Atlee)తో ఓ పాన్ ఇండియా సినిమా చేయాల‌నుకున్నాడు బ‌న్నీ కానీ అది కుద‌రలేదు. సందీప్ రెడ్డి వంగా(Sandeep Reddy Vanga)కి కూడా బ‌న్నీ క‌మిట్మెంట్ ఇచ్చాడు కానీ ఆ సినిమా చేయాలంటే ముందు ప్ర‌భాస్(Prabhas) స్పిరిట్(Spirit) పూర్తవాల్సి ఉంది. కాబ‌ట్టి ఇప్పుడు త్రివిక్ర‌మ్ తో సినిమా త‌ప్ప బ‌న్నీకి మ‌రో ఆప్ష‌న్ లేదు. ఈ నేప‌థ్యంలో విఎఫ్ఎక్స్, పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ లేటైనా టాకీ భాగం, సాంగ్స్ మాత్రం ఫాస్ట్ గా ఓ ప్లాన్ ప్ర‌కారం పూర్తి చేసేలా సితార(Sithara Entertainments) టీమ్ రెడీ అవుతుంద‌ట‌.   

 

 

 

 

 

praneet praneet praneet ASBL Radhey Skye Radha Spaces
Tags :