ASBL Koncept Ambience
facebook whatsapp X

మెగాస్టార్‌తో సినిమాను క‌న్ఫ‌ర్మ్ చేసిన రైట‌ర్

మెగాస్టార్‌తో సినిమాను క‌న్ఫ‌ర్మ్ చేసిన రైట‌ర్

మెగాస్టార్ చిరంజీవి(Megastar Chiranjeevi) యంగ్ డైరెక్ట‌ర్ వ‌శిష్ట(Vasishta) ద‌ర్శ‌క‌త్వంలో విశ్వంభ‌ర(Viswambhara) సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా సంక్రాంతికి రిలీజ్ కావాల్సింది కానీ గేమ్ ఛేంజర్(Game changer) కోసం వాయిదా ప‌డింది. సంక్రాంతికి రిలీజ‌యితే ఇప్ప‌టికే మెగాస్టార్ నెక్ట్స్ మూవీ నుంచి క్లారిటీ వ‌చ్చేది. కానీ అది వాయిదా ప‌డ‌టంతో చిరూ నుంచి త‌న త‌ర్వాతి సినిమా విష‌యంలో ఎలాంటి స‌మాచారం లేదు.

అయితే చిరూ(Chiru) నుంచి ఎలాంటి అప్డేట్ లేక‌పోయినా ఆయ‌న‌తో సినిమా చేయ‌నున్న‌ట్లు రైట‌ర్ బీవీఎస్ ర‌వి(BVS Ravi) క‌న్ఫ‌ర్మ్ చేశాడు. విశ్వంభ‌ర త‌ర్వాత చిరూ త‌మ సినిమానే చేయ‌బోతున్న‌ట్లు ర‌వి తాజాగా వెల్ల‌డించాడు. తిరుమ‌ల శ్రీవారి(Tirumala Srivaru)ని ద‌ర్శించుకున్న సంద‌ర్భంగా మీడియాతో మాట్లాడిన ర‌వి ఈ విష‌యాన్ని అనౌన్స్ చేశాడు.

అయితే ర‌వికి డైరెక్ట‌ర్ గా ఎక్స్‌పీరియెన్స్ ఉన్న‌ప్ప‌టికీ చిరూతో చేయ‌బోయే సినిమాకు అత‌ను ర‌చ‌యిత మాత్ర‌మేన‌ని ఈ సినిమా సోష‌ల్ ఎలిమెంట్స్ కూడి ఉంటుంద‌ని బీవీఎస్ ర‌వి తెలిపాడు. ర‌వి క‌థ అందించ‌బోయే సినిమాకు డైరెక్ట‌ర్ డైరెక్ట‌ర్ మోహ‌న్ రాజా(Mohan raja) అని తెలుస్తోంది. గ‌తంలో చిరూతో గాడ్ ఫాద‌ర్(God Father) చేసేట‌ప్పుడే మ‌రో సినిమా చేయ‌డానికి చిరూ ఆస‌క్తి చూపించాడు. ప్ర‌స్తుతం క‌థ రెడీ అవుతుంది. విశ్వంభ‌ర నుంచి చిరూ ఫ్రీ అయ్యాక ఈ సినిమా మొద‌ల‌య్యే అవ‌కాశాలున్నాయి.

 

 

 

 

praneet praneet praneet ASBL Radhey Skye Radha Spaces
Tags :