ASBL Koncept Ambience
facebook whatsapp X

విద్యార్థులకు కెనడా షాక్.. స్టూడెంట్ డైరెక్ట్ వీసా నిలిపివేత..!

విద్యార్థులకు కెనడా షాక్.. స్టూడెంట్ డైరెక్ట్ వీసా నిలిపివేత..!

కెనడాలో చదువులకోసం వెళ్లాలనుకునేవారికి చేదువార్త. స్టూడెంట్ వీసాలకు సంబంధించి కెనడా నిబంధనల్ని కఠినతరం చేసింది. కెనడా స్టూడెంట్ డైరెక్ట్ స్ట్రీమ్ (SDS) వీసా ప్రొగ్రామ్ నిలిపివేసింది. కెనడా హౌసింగ్, వనరుల సంక్షోభాన్ని ఎదుర్కోంటోంది. దేశంలోకి వలసలు పెరిగిపోతున్న తరుణంలో అక్కడి కెనడియన్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.ఈ నేపథ్యంలోనే స్టూడెంట్ వీసా ప్రోగ్రామ్‌ నిలిపేయాలని కెనడా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.

బ్రెజిల్, చైనా, కొలంబియా, కోస్టారికా, ఇండియా, మొరాకో, పాకిస్థాన్, పెరూ, ఫిలిప్పీన్స్, వియత్నాంతో సహా 14 దేశాల నుంచి అంతర్జాతీయ విద్యార్థులకు స్టడీ పర్మిట్ దరఖాస్తులను అందిస్తోంది. కెనడా స్టూడెంట్ డైరెక్ట్ స్ట్రీమ్ నిలిపివేయడంతో భారత్ సహా అంతర్జాతీయ విద్యార్థులపై తీవ్ర ప్రభావం పడనుంది. ఇమ్మిగ్రేషన్, రెఫ్యూజీస్, సిటిజెన్‌షిప్ కెనడా (IRCC) 2018లో ఈ ప్రొగ్రామ్ అమల్లోకి తీసుకొచ్చింది. కెనడా ప్రభుత్వ వెబ్‌సైట్‌లో దీనికి సంబంధించి వివరాలను అప్‌డేట్ చేసింది. దరఖాస్తు ప్రక్రియకు విద్యార్థులందరికీ సమాన, న్యాయమైన పరిమితిని అందించే దిశగా చర్యలు చేపట్టినట్టు తెలిపింది.

ఈ పథకం కింద నవంబర్ 8న మధ్యాహ్నం 2 గంటల వరకు స్వీకరించిన దరఖాస్తులను మాత్రమే అనుమతిస్తారు. ఆపై వచ్చే అన్ని దరఖాస్తులు రెగ్యులర్ స్టడీ పర్మిట్ స్ట్రీమ్ కింద ప్రాసెస్ అవుతాయి. ఈ వీసా ప్రొగ్రామ్ నిలిపివేయడంతో భారత్ తో పాటు 14 దేశాల విద్యార్థులు వీసా పొందడం కష్టతరంగా మారనుంది. కెనడా మొదటిసారిగా దేశంలోకి అనుమతించే వలసదారుల సంఖ్యను గణనీయంగా తగ్గించాలని భావిస్తోంది. 2025లో జరగనున్న ఫెడరల్ ఎన్నికల నేపథ్యంలో కెనడియన్ రాజకీయాల్లో ఈ సమస్య అత్యంత వివాదాస్పదంగా మారింది. కెనడాలో చాలా మంది వలసదారులు ఉన్నారని పోల్స్ సూచిస్తున్నాయి.

 

 

 

praneet praneet praneet Koncept Ambience Radhey Skye Radha Spaces
Tags :