ASBL Koncept Ambience
facebook whatsapp X

ఇజ్రాయెల్ పై ఇరాన్ దాడి... పశ్చిమాసియాలో సంబరాలు

ఇజ్రాయెల్ పై ఇరాన్ దాడి... పశ్చిమాసియాలో సంబరాలు

పశ్చిమాసియా యుద్ధరంగంలోకి ప్రవేశించింది. మొన్నటివరకూ ఉగ్రవాద సంస్థలు, ఇజ్రాయెల్ మధ్య దాడులపర్వం సాగింది. గాజాలో హమాస్ ఉగ్రవాదులున్నారని... మొత్తం విధ్వంసం సృష్టించింది ఇజ్రాయెల్.. భవనాలు నేలమట్టమయ్యాయి. లక్షలాది మంది ఆప్రాంతం వదిలి పారిపోగా... లక్ష మంది వరకూ చనిపోయి ఉంటారని అంచనాలున్నాయి. అయితే అక్కడితో ఆగని ఇజ్రాయెల్.. ఇప్పుడు తమ పొరుగునే ఉండి రాకెట్లతో కవ్విస్తున్న లెబనాన్ ను టార్గెట్ చేసింది.కారణం.. అక్కడి నుంచి హెజ్ బొల్లాఉగ్రవాదులు దాడులు చేయడమే. దీంతో హెజ్ బొల్లా టార్గెట్ గా దాడులు ముమ్మరం చేసింది. గాజాలో చేపట్టినట్లుగా లెబనాన్ లోనూ గ్రౌండ్ ఆపరేషన్ ప్రారంభించింది.

ఇంతలో ఎవ్వరూ ఊహించని విధంగా ఇరాన్ క్షిపణీ దాడులకు దిగింది.అయితే ఈ అంశాన్ని ముందుగానే గుర్తించిన అమెరికా.. ఇరాన్ క్షిపణి దాడులకు దిగుతుందని ఇజ్రాయెల్ ను రెండు గంటల ముందే హెచ్చరించింది.దీంతో అప్రమత్తమైన ఇజ్రాయెల్ సైన్యం... పౌరులకు అలర్ట్ జారీ చేసి, వారిని రక్షించుకోగలిగింది. ఆతర్వాత దాదాపు 200కి పైగా క్షిపణులు.. ఇజ్రాయెల్ పైకి దూసుకొచ్చాయి. వాటిలో కొన్నింటిని ఇజ్రాయెల్ రక్షణ వ్యవస్థ ఐరన్ డోమ్ అడ్డుకోగలిగింది. అయితే కొన్ని మాత్రం జనావాసాల మీద పడినట్లు సమాచారం. ఇరాన్ దాడులకు ప్రతిదాడులు తప్పవని ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు హెచ్చరించారు. ఇరాన్ పెద్ద తప్పు చేసిందని.. దానికి ప్రతిగా మూల్యం తప్పదన్నారు. సరైన సమయం చూసి గట్టి దెబ్బకొడతామన్నారు నెతన్యాహు.

మరోవైపు.. ఇజ్రాయెల్ పై దాడిని అమెరికా ఖండించింది. అమాయక పౌరులు లక్ష్యంగా దాడులు చేశారని ఆగ్రహం వ్యక్తం చేసింది. పశ్చిమాసియాలో ఇరాన్ వల్లే.. పరిస్థితులు స్థిరంగా ఉండడం లేదని ఆరోపించింది. ఇజ్రాయెల్ కు తమ మద్దతు కొనసాగుతుందని స్పష్టం చేశారు అమెరికా అధ్యక్షుడు బైడన్ అయితే ఈ దాడులపై ఐక్యరాజ్యసమితి ఆందోళన వ్యక్తం చేసింది. వెంటనే సీజ్ ఫైర్ ప్రకటించాలని ఇరుపక్షాలకు సూచించింది. అంతేకాదు.. ఐక్యరాజ్యసమితి ప్రత్యేకంగా భేటీ అయింది.

మరోవైపు.. ఇజ్రాయెల్ లో ఉన్న వేలాది మంది భారతీయులకు .. కేంద్రం ముందస్తు హెచ్చరికలు జారీ చేసింది. ఇజ్రాయెల్ ఎంబసీతో టచ్ లో ఉన్నామని... అక్కడి అధికారుల సూచనలకు అనుగుణంగా నడుచుకోవాలని సూచించింది. అలాగే అనవసరంగా ఇరాన్ ప్రయాణాలు చేయవద్దని స్పష్టం చేసింది. మరోవైపు.. ఇజ్రాయెల్ పై ఇరాన్ దాడులతో లెబనాన్, గాజాలోని ఇరాన్ మద్దతుదారులు, బాధితులు సంబరాలు చేసుకున్నారు. ఇజ్రాయెల్ కు సైతం దాడుల భయం పట్టుకుందని.. ముందుముందు మరిన్ని దాడులు తప్పవని హెచ్చరించారు.

 

 

praneet praneet praneet ASBL Radhey Skye Radha Spaces
Tags :