ASBL Koncept Ambience
facebook whatsapp X

గ్రాండ్‌ కాన్యన్‌ ఆఫ్‌ ఇండియాగా ... గండికోట : కేంద్ర మంత్రి పెమ్మసాని

గ్రాండ్‌ కాన్యన్‌ ఆఫ్‌ ఇండియాగా ... గండికోట : కేంద్ర మంత్రి పెమ్మసాని

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలోని కడప జిల్లాలోని గండికోటను పర్యాటక ప్రదేశంగా పూర్తి స్థాయిలో అభివృద్ధి చేసేందుకు కేంద్ర ప్రభుత్వం రూ.78 కోట్లు మంజూరు చేసింది. ఈ మేరకు కేంద్ర పర్యాటక మంత్రిత్వ శాఖ నిధులు మంజూరు చేసినట్లు కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్‌ వెల్లడించారు. గ్రాండ్‌ కాన్యన్‌ ఆఫ్‌ ఇండియా గా గండికోటను అభివృద్ధి చేసేలా చర్యలు తీసుకుంటున్నట్లు కేంద్ర మంత్రి తెలిపారు. నాకు గండికోట ఒక ప్రత్యేక ప్రాజెక్టు. మా పూర్వీకుల ప్రదేశంగా గండికోటకు పేరు ఉంది అని అన్నారు. రాష్ట్రంలోని ఒక్కొక్క ప్రాజెక్టును చేపట్టి, వాటిని పూర్తి చేసేందుకు అన్ని చర్యలు  తీసుకుంటున్నట్లు మంత్రి తెలిపారు.

 

 

praneet praneet praneet Koncept Ambience Radhey Skye APR Group
Tags :