జన్మభూమి అభివృద్ధికి ఎన్నారైలు తోడ్పడాలి
తెలుగు టైమ్స్ ఇంటర్య్వూలో కేంద్రమంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ పిలుపు
అమెరికాలో ఉంటూ, జన్మభూమికి సేవ చేయాలన్న ఉద్దేశ్యంతో తెలుగుదేశం పార్టీ అధినేత, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పిలుపుమేరకు రాజకీయాల్లోకి ప్రవేశించిన పెమ్మసాని చంద్రశేఖర్ గత లోక్‌సభ ఎన్నికల్లో గుంటూరు నుంచి టిడిపి అభ్యర్థిగా పోటీ చేసి ఘనవిజయాన్ని సాధించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మంత్రివర్గంలో గ్రామీణాభివృద్ధి, కమ్యూనికేషన్స్ శాఖ కేంద్ర సహాయమంత్రిగా పదవిని అందుకున్నారు. అటు కేంద్రమంత్రిగా, ఇటు ఎన్నారైగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రగతికోసం, గుంటూరు నియోజకవర్గ అభివృద్ధికోసం కృషి చేస్తున్నారు. ‘తెలుగు టైమ్స్’కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన పలు విషయాలను వెల్లడిరచారు. అమెరికాలో ఉంటున్న ఎన్నారైలు జన్మభూమి ప్రగతిలో పాలుపంచుకోవాలని ఆయన కోరారు.
అమెరికాలో తెలుగు కమ్యూనిటీకి మీరుచేసిన సేవలు తెలియజేయండి?
అమెరికాలోని తెలుగు కమ్యూనిటికి కూడా నావంతుగా సేవలందిస్తున్నాను. పెన్సిల్వేనియోలోని జీసింజర్ మెడికల్ కాలేజీ నుంచి పీజీ, ఇంటర్నల్ మెడిసిన్ పట్టాలు అందుకున్నాను. జాన్ హాప్కిన్స్ యూనివర్సిటీలోని సినాయ్ హాస్పిటల్ లో ప్రొఫెసర్ గానూ, వైద్యుడిగానూ ఐదేళ్ల పాటు సేవలందించారు. నేను ఉన్నత చదువుల కోసం అమెరికా వెళ్ళిన తరువాత వైద్య సేవలు అందించేందుకు ఇచ్చే లైసెన్సింగ్ పరీక్షల సమయంలో అనేక కష్టాలు ఎదుర్కొన్నాను. సరైన మెటీరియల్ లేక, వసతి సదుపాయాలు దొరక్క ఇబ్బందులు పడ్డాను. అమెరికాలో మెడికల్ లైసెన్సింగ్ ఎగ్జామ్ (యూఎస్‌ఎంఎల్‌ఈ) కోసం వచ్చే విదేశీ విద్యార్థులు తనలాగా కష్టాల పాలవకూడదని భావించి ట్రైనింగ్ మెటీరియల్ ను అంతా కలిపి ఒకే పుస్తకంగా రూపొందించాను. ఆ పుస్తకం ధరను కూడా నామమాత్రంగానే నిర్ణయించి ఎంతోమంది విద్యార్థులకు అందించాను.
‘యూఎస్‌ఎంఎల్‌ఈ’ కోసం సన్నద్ధమ్యే విద్యార్థులకు ఆన్ లైన్ లో శిక్షణ ఇచ్చేందుకు ‘యూ వరల్డ్’ పేరిట ఓ వేదిక ను ఏర్పాటు చేశాను. ఎంతోమంది విదేశీ విద్యార్థులు ‘యూఎస్‌ఎంఎల్‌ఈ’ గట్టెక్కేందుకు ఈ వేదిక ఎంతగానో ఉపయోగపడిరది. ప్రస్తుతం ‘యూ వరల్డ్’ సంస్థ డాక్టర్ లైసెన్సింగ్ ఎగ్జామ్ శిక్షణ మాత్రమే కాకుండా... నర్సింగ్, ఫార్మసీ, ఫైనాన్స్, లా, కామర్స్, అకౌంటింగ్ రంగాల్లోనూ శిక్షణ ఇస్తోంది.
అమెరికాలో ఆరోగ్య బీమాలేని ఎన్నారైలకు పెమ్మసాని ఫౌండేషన్ ద్వారా ఆరోగ్య సేవలు అందిస్తున్నాను. ఈ ఫౌండేషన్ డాలస్ లో ఉంది. పెమ్మసాని ఫౌండేషన్ ద్వారా ప్రతిభావంతులైన విద్యార్థులకు స్కాలర్ షిప్ లు ఇచ్చి ప్రోత్సహిస్తున్నారు. అంతర్జాతీయ ఆర్థిక సంక్షోభం సమయంలో కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ (సీఎస్‌ఆర్) కింద అనేక రకాల సేవలు అందించారు.
కేంద్రమంత్రిగా మీరు చేసిన అభివృద్ధి కార్యక్రమాలను తెలియజేయండి?
గుంటూరు నుంచి ఎంపిగా గెలిచిన తరువాత కేంద్రంలో సహాయమంత్రి బాధ్యతలు చేపట్టాక, అటు దేశంతోపాటు, ఇటు నియోజకవర్గం అభివృద్ధికి విశేషంగా కృషి చేస్తున్నాను. గత ప్రభుత్వ హయాంలో ఈ ప్రాంతంలో అభివృద్ధి సరైన దిశలో జరగలేదు. దానిని సరిదిద్దేందుకు ప్రయత్నిస్తున్నాను. కేంద్రమంత్రిగా బాధ్యతలు చేపట్టాక పలు అభివృద్ధి పనులు ఈ ప్రాంతానికి వచ్చేలా కృషి చేశాను.
గుంటూరు ప్రజల ట్రాఫిక్ సమస్యలను తీర్చడంలో ప్రధాన పాత్ర పోషించే శంకర్ విలాస్ వంతెన నాలుగు లైన్ల విస్తరణ - ఆర్.ఓ.బి నిర్మాణానికి కృషి చేసి దీనికి కేంద్రం నుంచి అనుమతిని కూడా తీసుకువచ్చాను. సి ఆర్ ఐ ఎఫ్ పథకం కింద ఆయా నిర్మాణాలకు రూ. 98 కోట్లను మంజూరు చేస్తున్నట్లుగా రోడ్ ట్రాన్స్ పోర్ట్, హైవేస్ కేంద్ర మంత్రి నితిన్ గడ్కరి ఎక్స్ ఖాతా వేదికగా ప్రకటించింది.
ప్రత్తిపాడు నియోజకవర్గంలో 100 పడకల ఈ.ఎస్.ఐ ఆసుపత్రికి కేంద్ర ప్రభుత్వ ఆమోదం తెలిపింది, వేగవంతమైన నిర్ణయాల ఫలితంగా కేవలం 2-3 నెలల వ్యవధిలోనే కేంద్ర ప్రభుత్వం స్పందించి దశాబ్దాల కలగా మిగిలిన అభివృద్ధిపనులకు ఆమోదం తెలియజేసింది.
రాజధాని ప్రాంతమైన అమరావతిలో ఎంఎస్‌ఎంఈ రెండో టెక్నాలజీ సెంటర్ (టీసీ) ఏర్పాటుకు నావంతుగా కృషి చేశాను. దాంతో రాష్ట్ర ప్రభుత్వం 20 ఎకరాలను ఇందుకోసం కేటాయిస్తూ ఉత్తర్వులిచ్చింది. ఇందులో టెస్టింగ్ ఫెసిలిటి కేంద్రాన్నీ అందుబాటులోకి తీసుకురానుంది. ఈ సెంటర్ ఏర్పాటుకు ఎప్పటికప్పుడు కేంద్రంతో సంప్రదింపులు జరపాలని సీఆర్‌డీఏ కమిషనర్, డైరెక్టర్ ఆఫ్ ఇండస్ట్రీస్‌ను ప్రభుత్వం ఆదేశించింది.
మీకు వచ్చిన అవార్డులు ఇతర వివరాలు చెబుతారా?
అమెరికాలో ఉన్నప్పుడు పలు అవార్డులు వచ్చాయి. 2020లో నార్త్ టెక్సాస్ ఏరియాలో ఎంట్రప్రెన్యూర్ ఆఫ్ ద ఇయర్ సౌత్ వెస్ట్ రీజియన్ అవార్డు లభించింది. ఏఎస్ యూ-జీఎస్వీ 150 సమ్మిట్ పురస్కారంతో పాటు, మీడియా సంస్థల నుంచి ఎన్నో అవార్డులు స్వీకరించాను. అమెరికాలోని అనేక ప్రతిష్ఠాత్మక సంస్థలు సభ్యత్వాన్ని ఆఫర్ చేశాయి. ప్రపంచ ప్రఖ్యాత ఫోర్బ్స్ బిజినెస్ కౌన్సిల్ లో కూడా సభ్యుడిగా ఉన్నాను. భారత సంతతి అమెరికా వైద్యుల సంఘంలోనూ సభ్యత్యం ఉంది.
సమస్యలు ఉంటే నా దృష్టికి తీసుకురండి...
ప్రతీ సోమవారం నుండి శుక్రవారం వరకు తాను ఢిల్లీలో ఉంటాను. శని, ఆదివారాల్లో మాత్రం గుంటూరు నియోజకవర్గ ప్రజలకు అందుబాటులో ఉండేందుకు తాను శక్తి మేర ప్రయత్నిస్తాను. తన కార్యాలయం
షషష.ఎవస్త్రబఅ్‌బతీఎజూ.ఱఅ పేరిట ఒక వెబ్ సైట్‌ను కూడా రూపొందించింది. ఎవరికీ ఏ సమస్య ఉన్నా.. ఈ వెబ్‌సైట్ ద్వారా అర్జీ సమర్పిస్తే ఆ అర్జీని పరిశీలించి పరిష్కరించేందుకు తన కార్యాలయ సిబ్బంది తోడ్పడుతారు.
మీ రాజకీయ ప్రవేశం ఎలా జరిగింది?
నేను మొదటి నుంచి తెలుగుదేశం పార్టీ అభిమానిని. టీడిపి ఎన్నారై విభాగంలో చురుగ్గా పని చేశాను. నా ఆదాయంలో చాలా వరకు టీడీపీకి విరాళంగా ఇచ్చాను. అనేక సందర్భాల్లో పార్టీ కోసం నిధులు సేకరించి అభిమానాన్ని చాటుకుంటున్న విషయాన్ని గమనించి టీడీపీ అధినాయకుడు చంద్రబాబు క్రియాశీలక రాజకీయాల్లోకి రావాలని నన్ను ఆహ్వానించారు. రాజకీయాల్లోకి రావడం, గుంటూరు టీడీపీ టికెట్ అందుకోవడం, భారీ మెజారిటీతో విజయం సాధించి, కేంద్రంలోనూ సహాయమంత్రి పదవిని అందుకోవడం అంతా చకచకా జరిగిపోయాయి.
కేంద్రంలోనూ, రాష్ట్రంలోనూ మీ పాత్ర పెరిగినట్లు కనిపిస్తోంది?
అవును. ప్రధాని మోదీ బృందంలో అత్యంత క్రియాశీల మంత్రులలో ఒకనిగా గుర్తింపును తెచ్చుకున్నాను. చాలా మంది మంత్రుల మాదిరిగా కాకుండా, నేను నా కార్యాలయాన్ని పూర్తిగా అదుపులో ఉంచుకోవడంతో పాటు నిర్ణయాలు తీసుకోవడంలో చూపిస్తున్న కృషినే నాకు ఈ గుర్తింపును తీసుకువచ్చింది. దానికితోడు చాలామంది నేను డబ్బున్న ఎన్నారై కాబట్టి గెలిచిన తరువాత అమెరికాకు వెళ్ళిపోతారని అనుకున్నారు. కాని నాపై విశ్వాసం ఉంచి నన్ను గెలిపించిన ప్రజలకు ఎల్లప్పుడు సేవ చేయడమే నా కర్తవ్యంగా భావించి ఢల్లీిలో కేంద్రమంత్రిగా బాధ్యతలు నిర్వహిస్తూ వారంలో రెండురోజులు నా నియోజకవర్గ ప్రజలకోసం సమయాన్ని కేటాయిస్తున్నాను. వారి సమస్యలను తీర్చుకోవడానికి నియోజకవర్గంలోని కార్యాలయం ఎల్లవేళలా పనిచేస్తుంటుంది. వారు ఇచ్చిన ఆర్జీల సమస్యల పరిష్కారానికి నావంతుగా కృషి చేస్తున్నాను.
కేంద్రమంత్రిగా మీరు రాష్ట్రానికి ఏమి చేస్తున్నారు?
కేంద్రంలో ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఆయన క్యాబినెట్‌లో రాష్ట్రం నుంచి నాకు, రామ్మోహన్ నాయుడుకు చోటు లభించింది. మేము ఇద్దరము రాష్ట్రానికి కేంద్రం నుంచి రావాల్సిన అనుమతులు, నిధులు ఇతరత్రా విషయాలపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో కలిసి, ఆయన సూచనలతో ఎప్పటికప్పుడు ఇతర కేంద్రమంత్రులతోనూ, కేంద్ర అధికారులతోను సంప్రదింపులు జరుపుతూ రాష్ట్ర అభివృద్ధికి కృషి చేస్తున్నాము. రైలు మార్గాల అభివృద్ధి, విమానాశ్రయాల అభివృద్ధి, ఏర్పాటు, కమ్యూనికేషన్స్ వంటి ఇతర రంగాలకు సంబంధించిన విషయాల్లో రాష్ట్రానికి తగిన ప్రాధాన్యం లభించేలా కృషి చేశాము. కేంద్ర నిధులు కూడా రాష్ట్రానికి వచ్చేలా కృషి చేశాము.
ప్రధాన మంత్రి ఆవాస్ యోజన-గ్రామీణ్ కింద డిసెంబరు 2024 నాటికి దేశంలో 2.95 కోట్ల ఇళ్ల నిర్మాణ లక్ష్యంగా పెట్టుకోగా ఇప్పటికే 2.66 కోట్ల ఇళ్లు పూర్తి చేశాము. ఈ పథకం కింద మన రాష్ట్రంలోని ప్రజలకు కూడా ప్రయోజనం కలిగించేందుకు కృషి చేస్తున్నాను. దీంతోపాటు వచ్చే ఐదేళ్లలో 2 కోట్ల ఇళ్లను అదనంగా ప్రధానమంత్రి ఆవాస్ యోజన-గ్రామీణ్ కింద నిర్మించనున్నాము. రాష్ట్రంలోని పేదలు దీనిని ఉపయోగించుకోవాలని కోరుతున్నాను. ఈ పథకం కింద లబ్ధిదారులను వేగంగా, పారదర్శకంగా గుర్తించేందుకు ఆవాస్ ప్లస్ 2024 మొబైల్ యాప్‌ను అందుబాటులోకి తెచ్చాము. ఇది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌తో పని చేస్తూ ముఖచిత్రం ఆధారంగా లబ్ధిదారులను వేగంగా గుర్తించి గేమ్ ఛేంజర్‌గా మారుతుంది. ఇళ్ళులేనివారు ఈ పథకాన్ని ఉపయోగించుకోవాలి.
2025 మార్చి నాటికి దేశ వ్యాప్తంగా బీఎస్‌ఎన్‌ఎల్ 4జీ సేవలను అందుబాటులోకి తేనున్నాము. పట్టణ ప్రాంతాలతో పాటు మారుమూల గ్రామాలకు ఇంటర్‌నెట్ సేవలు అందించడమే బీఎస్‌ఎన్‌ఎల్ లక్ష్యమన్నారు. 4,500 టవర్లు ఏర్పాటు చేసి నాణ్యమైన 4జీ సేవలను ప్రజలకు అందుబాటులోకి తెస్తామని తెలిపారు. విద్యుత్ ఎంత ముఖ్యమో.. నాణ్యమైన ఇంటర్నెట్ సేవలు కూడా అంతే ముఖ్యమన్నారు. ప్రైవేటు సంస్థలు మారుమూల పల్లెలకు ఇంటర్నెట్ సేవలు అందించవని.. లాభాపేక్ష లేకుండా వారికి కూడా బ్రాడ్ బ్యాండ్ సేవలు అందించాలన్నదే ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఉద్దేశమని ఇందుకు తగ్గట్టుగా తమ శాఖ పనిచేస్తోందన్నారు.
అమరావతి.. పోలవరం నిర్మాణాలను రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది. కేంద్రం కూడా అందుకు పూర్తి స్థాయిలో సహకరిస్తోంది. అమరావతికి రూ.2500 కోట్లతో రైల్వే లైన్ మంజూరైంది. రూ.12 వేల కోట్ల నుంచి రూ.15 వేల కోట్ల విలువైన అమరావతి ఔటర్ రింగ్ రోడ్డు నిర్మాణానికి కూడా కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ అమోదం తెలిపారు. దీనికి అవసరమైన భూ సేకరణకు కేంద్రం సహకరిస్తోంది. వెనకబడిన జిల్లాల జాబితాలో ప్రకాశం జిల్లాను కూడా కలిసి.. ఆయా జిల్లాల అభివృద్ధికి కేంద్రం ప్రత్యేకంగా నిధులు ఇస్తోంది. రాష్ట్రానికి రెండు మేజర్ పారిశ్రామిక కారిడార్లు రానున్నాయి. వివిధ ప్రాజెక్టుల రూపంలో దాదాపు రూ.80 వేల కోట్ల నిధులు రాష్ట్రానికి వస్తున్నాయి. కేంద్ర పథకాల ద్వారా మరిన్ని నిధులు తీసుకువస్తాము.
పెమ్మసాని ఫౌండేషన్ ద్వారా చేస్తున్న సేవలేమిటి?
అమెరికాలోనూ, రాష్ట్రంలోని తెలుగు కమ్యూనిటికీ సేవ చేయాలన్న లక్ష్యంతో పెమ్మసాని ఫౌండేషన్ ను ప్రారంభించాను. ఈ ఫౌండేషన్ ఏర్పాటై ఇప్పటికీ ఐదేళ్ళకు పైగా అయింది. ఈ ఫౌండేషన్ ద్వారా కమ్యూనిటీకి అవసరమైన సహాయాన్ని అందిస్తున్నాము. నీటి ఎద్దడి ఉన్న ప్రాంతాల్లో బోర్‌వెల్స్ వేయించడం, మంచినీటి శుద్ధి ప్లాంట్‌ల ఏర్పాటు, రక్తదాన శిబిరాలు, క్యాన్సర్ రన్‌లు, మెడికల్ క్యాంప్స్ నిర్వహణ ఇలా కమ్యూనిటికీ ఉపయోగపడే పనులను చేస్తున్నాము. ప్రతిభగల పేద విద్యార్థులకు స్కాలర్‌షిప్‌లు ఇవ్వడం, ఫుడ్‌బ్యాంక్‌లకు ఆహార సరఫరా వంటివి కూడా చేశాము. భవిష్యత్తులో కూడా ఫౌండేషన్ ద్వారా మరింతగా సేవలందించేందుకు కృషి చేస్తున్నాను. మహిళల ఆర్థికాభివృద్ధికి కూడా ఫౌండేషన్ కృషి చేస్తోంది.
యువతకు మీరు ఇచ్చే సందేశమేమిటి?
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, ముఖ్యమంత్రి చంద్రబాబు వంటి లీడర్ల విజనరీతో భారత దేశంలో యువతకు మంచి భవిష్యత్తు కనిపిస్తోంది. వికసిత్ భారత్ కార్యక్రమం ద్వారా మారుమూల ప్రాంతాల్లోనూ దాగి ఉన్న ప్రతిభావంతులను వెలికితీసి, పరిశ్రమల స్థాపనకు ప్రోత్సాహం అందిస్తున్నారు.
2024 ముందు భారతదేశంలో కేవలం అతి తక్కువ సంఖ్యలో స్టార్టప్‌లు ఉండేవి. ప్రస్తుతం 1.12 లక్షల స్టార్టప్ కంపెనీలు ఉన్నాయి. యూనికాన్స్ నాలుగు మాత్రమే ఉండేవి, ప్రస్తుతం అవి 1100 ఉన్నాయి. ఇండియాలో సుస్థిరమైన ప్రగతికి వికసిత్ భారత్, వికాస్ వంటి కార్యక్రమాలు దోహదం చేస్తాయి. నేను నిర్వహిస్తున్న కమ్యూనికేషన్స్, రూరల్ డెవలప్ మెంట్ శాఖల్లో స్టార్టప్ లను ప్రోత్సహిస్తానని కొత్త ఆలోచనలతో యువత ముందుకు రావాలి.
ఎన్నారైలకు మీరేమి చెప్పనున్నారు?
ఎన్నారైల సమస్యలపై తనకు అవగాహన ఉందని, అలాగే జన్మభూమి అభివృద్ధిలో ఎన్నారైల పాత్ర కీలకమని అంటూ, పెట్టుబడులకు రాష్ట్రం అనుకూలంగా ఉందని, ఎన్నారైలు పెట్టుబడి పెట్టి రాష్ట్ర ప్రగతికి కృషి చేయాలని కోరుతున్నాను.
Dr చంద్ర శేఖర్ పెమ్మసాని, కేంద్ర గ్రామీణాభివృద్ధి, టెలి కమ్యూనికేషన్స్ శాఖ సహాయ మంత్రిగా ఎంత బిజీగా వున్నా, ప్రతి వారం (శని - ఆదివారాల్లో) గుంటూరు వస్తున్నారని తెలిసి, ఆయనకు ఫోన్ చేసి గుంటూరు లో మంత్రిగారి ఆఫీసుకి వెళ్ళిన నేను ఆయన ఆఫీసు లో వున్న జనం చూసి ఆశ్చర్య పోయాను. ప్రతి రూమ్ లోనూ ఆయన ను కలవటానికి వారు, ఆయన కు తమ సమస్యలు చెప్పుకొనే వారు, అర్జీలు ఇచ్చేవారు వున్నారు. నియోజక వర్గంకి చెందిన అనేక మంది కార్య కర్తలు, అధికారులు వున్నారు.
Dr చంద్ర అమెరికాలో పబ్లిక్ ఫంక్షన్స్‌లో ఎప్పుడూ ఎక్కడా కనిపించని వ్యక్తిగా నాకు తెలుసు. అనేక సంస్థలకు పెద్ద మొత్తంలో విరాళాలు ఇచ్చి కూడా ఆ సంస్థలు నిర్వహించే సమావేశాలకు దూరంగా వుండే వ్యక్తి. ఇప్పుడు ప్రజా సేవ, నియోజక వర్గ అభివృద్ధి, రాష్ట్రాభివృద్ధి, తన మంత్రిత్వ శాఖ పనులు లక్ష్యం గా పెట్టుకొని పూర్తిగా ప్రజల మనిషిగా మారిన ణతీ చంద్రకి అభినందనలు.
- చెన్నూరి వెంకట సుబ్బారావు, ఎడిటర్, తెలుగుటైమ్స్