ASBL Koncept Ambience
facebook whatsapp X

ఇండియన్ సైబర్ ఆర్మీ సిద్ధం..

ఇండియన్ సైబర్ ఆర్మీ సిద్ధం..

ప్రపంచం సైబర్ వరల్డ్ గా మారింది. అంతా డిజిటల్ మయమైంది. లావా దేవీలు సైతం డిజిటల్ గానే సాగుతున్నాయి. అయితే ఇదే సమయంలో సైబర్ కేటుగాళ్లు.. దోపిడీలు మొదలెట్టేశారు. అమాయకులే లక్ష్యంగా దాడులు చేస్తూ.. కోట్లాది రూపాయలు దోచేస్తున్నారు. దీంతో ఇది ఇండియాకు పెను సవాల్ గా మారింది.ఎందుకంటే ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న లావాదేవీల్లో 46 శాతం వరకూ ఇండియాలోనే జరుగుతున్నాయి. దీంతో సైబర్ భద్రతకు కేంద్రం అధిక ప్రాధాన్యమిస్తోంది.

దీనికోసం సైబర్ ఆర్మీని సిద్ధం చేస్తోంది. సైబర్ సెక్యూరిటీ ప్రాముఖ్యతను గురించి కేంద్ర హోంమంత్రి అమిత్ షా కీలకవ్యాఖ్యలు చేశారు. దేశాభివృద్ధిలో సైబర్ సెక్యూరిటీ కీలక పాత్ర పోషిస్తుందని... ఈసాంకేతికత ఓ వరంలాంటిదన్నారు. ఇండియన్ సైబర్ క్రైమ్ కో ఆర్డినేషన్ సెంటర్ (14 సి) ఆవిర్బావ దినోత్సవంలో భాగంగా అమిత్ షా ఈ వ్యాఖ్యలు చేశారు. సైబర్ నేరానికి హద్దులు లేవని .. దాన్ని ఎదుర్కొనేందుకు భాగస్వాములందరూ కలసికట్టుగా ముందుకు రావాలని అమిత్ షా పిలుపునిచ్చారు.

సైబర్ సెక్యూరిటీ జాతీయ భద్రతలో అంతర్భాగం. దేశంలో సైబర్ నేరాలు పెరిగిపోతున్న నేపథ్యంలో.. వాటిని ఎదుర్కొనేందుకు.. కేంద్రం తగిన ప్రణాళిక రచిస్తోందన్నారు అమిత్ షా. సైబర్ నేరాలను ఎదుర్కొనేందుకు వచ్చే ఐదేళ్లలో 5 వేల మంది సైబర్ కమెండోలకు శిక్షణ ఇచ్చి సిద్ధం చేస్తామన్నారు. సైబర్ ప్రపంచాన్ని సురక్షితంగా మార్చాల్సిన అవసరముందని.. ఆ బాధ్యతను కేంద్రం తీసుకుంటోందన్నారు అమిత్ షా.

సైబర్ నేరాలపై పోరాడేందుకు ఇండియన్ సైబర్ క్రైమ్ కో ఆర్డినేషన్ సెంటర్ (14 సి) నేతృత్వంలో నాలుగు ఫ్లాట్ ఫామ్ లను సైతం అమిత్ షా ప్రారంభించారు.2018లో కేంద్ర హోంశాఖ ఆధ్వర్యంలో ఇండియన్ సైబర్ క్రైమ్ కో ఆర్డినేషన్ సెంటర్ (14 సి) ని స్థాపించారు. దీని ద్వారా దేశంలో జరుగుతున్న సైబర్ నేరాలను ఎదుర్కోవడంలో భాగంగా చట్టాన్ని అమలు చేసే సంస్థల సామర్థ్యాన్ని పెంచడం, వాటాదారుల మధ్య సమన్వయాన్ని సాధించడం ఈ కో ఆర్డినేషన్ సెంటర్ లక్ష్యంగా చెబుతున్నారు.

 

 

praneet praneet praneet ASBL Radhey Skye Radha Spaces
Tags :