ASBL NSL Infratech

చందూ మొండేటి ప్లాన్ వ‌ర్క‌వుటవుతుందా?

చందూ మొండేటి ప్లాన్ వ‌ర్క‌వుటవుతుందా?

కెరీర్ స్టార్టింగ్ నుంచి డిఫ‌రెంట్ క‌థ‌ల్ని ఎంచుకుని టేకింగ్ ప‌రంగా కూడా త‌న‌దైన ప్ర‌త్యేక ముద్ర వేయ‌గ‌లిగాడు డైరెక్ట‌ర్ చందూ మొండేటి. ఫ‌స్ట్ మూవీ కార్తికేయ‌తోనే డివోష‌న‌ల్ బ్యాక్ డ్రాప్ లో మంచి హిట్ అందుకోవ‌డ‌మే కాకుండా విమ‌ర్శ‌కుల‌ను కూడా ఇంప్రెస్ చేయ‌గ‌లిగాడు. ఆ త‌ర్వాత ప్రేమమ్ తో మంచి మార్కులేసుకున్నాడు.ఆ త‌ర్వాత వ‌చ్చిన స‌వ్య‌సాచి సినిమాతో అనుకున్న ఫ‌లితాన్ని అందుకోలేక‌పోయిన‌ప్ప‌టికీ కార్తికేయ‌2తో బ్లాక్ బ‌స్ట‌ర్ అందుకుని పాన్ ఇండియా స్థాయిలో క్రేజ్ సంపాదించుకున్నాడు. అలాంటి చందూ మొండేటి ప్ర‌స్తుతం నాగ చైత‌న్య‌తో తండేల్ సినిమా చేస్తున్నాడు. ఇది కూడా డిఫ‌రెంట్ బ్యాక్ డ్రాప్ లోనే తెర‌కెక్కుతుంది.

ఇదిలా ఉంటే తండేల్ త‌ర్వాత చందూ మొండేటి మెగాస్టార్ చిరంజీవితో సినిమా చేయాల‌ని మెగా ప్లాన్ వేస్తున్న‌ట్లు తెలుస్తోంది. తండేల్ నిర్మాత అల్లు అర‌విందే కాబ‌ట్టి ప్రాథ‌మికంగా ఒక‌సారి చిరూని క‌లిశాడ‌ని టాక్. ఇంకా అఫీషియ‌ల్ అనౌన్స్‌మెంట్ రాలేదు. కానీ దీనికి సంబంధించిన చ‌ర్చ‌లు అయితే జ‌రుగుతున్నాయంటున్నారు. ప్ర‌స్తుతం విశ్వంభ‌ర సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్న చిరూ, ఆ త‌ర్వాతి సినిమాను ఎవరితో చేస్తాడ‌నేది ఇప్పుడు ఆస‌క్తిక‌రంగా మారింది.  

 

 

 

 

 

praneet praneet praneet obili-garuda Vertex poulomi Png-jewelry
Tags :