ChandraBabu and Pawan ahead of Jagan: ఆ విషయంలో జగన్ ముందంజలో కూటమి..
2024 సార్వత్రిక ఎన్నికల్లో కూటమి విజయానికి ముఖ్య కారణం ప్రజల్లో వాళ్లకు పెరిగిన పాపులారిటీ. దీనికంటే ముఖ్యంగా జగన్ (Jagan) ప్రభుత్వాన్ని విమర్శిస్తూ చంద్రబాబు ప్రజల్లోకి వచ్చిన తర్వాతే.. జగన్ సర్కార్ కు వేడి తగిలింది. అందుకే ఈసారి జగన్ కూడా మామూలు కంటే ముందుగానే ప్రజలలోకి రావడానికి చూస్తున్నారు. ఇక ఆయన పర్యటనకు సంబంధించిన ముహూర్తం కూడా ఫిక్స్ అయిన విషయం అందరికీ తెలిసిందే.
అయితే మరోపక్క చంద్రబాబు (ChandraBabu) , పవన్ (Pawan) .. రాష్ట్ర ప్రభుత్వ అమలు చేస్తున్న పథకాల గురించి ప్రజల మధ్యకు తీసుకువెళ్లడానికి జోరుగా ప్రచారం సాగించాలి అని భావిస్తున్నారు. ఇప్పటికే ప్రభుత్వం ఏర్పడి ఆరు మాసాల సమయం గడుస్తున్న నేపథ్యంలో తాము ఏం చేస్తున్నాం అన్న విషయం ప్రజలకు స్పష్టంగా వివరించాలి అనేది చంద్రబాబు ప్లాన్. అందుకే ముందుగా తమ పార్టీ ఎమ్మెల్యేలకు చంద్రబాబు (Chandra Babu) ప్రజల మధ్యకు వెళ్లాలి అని దిశా నిర్దేశం చేస్తున్నారు.
ఇక వచ్చే నెలలో జగన్ ప్రజల మధ్యకు కూటమి ప్రభుత్వంపై సెగ పెంచడం కోసం వస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రజలు మర్చిపోయిన ఎన్నో అంశాలను లేవనెత్తి.. కూటమిపై అసంతృప్తిని సృష్టించే అవకాశం ఉండనే ఉంది. ఇక జగన్ సర్కార్ విషయానికి వస్తే రూలింగ్ లోకి వచ్చిన మూడో సంవత్సరం నుంచే మద్యంపై తీవ్రవ్యతిరేకత ఎదుర్కొంది. ఈ పాయింట్ ని మరింత ఎలివేట్ చేసి చంద్రబాబు ప్రజల్లో సక్సెస్ సాధించారు.
అయితే ఇప్పుడు ప్రభుత్వం ఏర్పడి ఆరు మాసాలు కూడా కాకముందే జగన్ అదే పని చేయడానికి ముందుకు వస్తున్నారు. ఈ నేపథ్యంలో జగన్ కచ్చితంగా సూపర్ సిక్స్ (Super Six) పథకాలపై ప్రజలను రెచ్చగొట్టే అవకాశం ఉంది. అలాగే గతంలో కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలు.. లాంటి విషయాలపై కూడా గట్టిగానే మాట్లాడుతారు. ఇప్పుడే వ్యతిరేకత ప్రారంభమైతే అది ఎలాంటి రూపు దాలుస్తుందో అందరికీ తెలుసు.
ఈ నేపథ్యంలో జగన్ కంటే ముందే కూటమి ప్రజల్లోకి రావాలి అనేది చంద్రబాబు ఆలోచన. కూటమి ఏమి చేయలేదు అన్న విషయాన్ని జగన్ మాట్లాడే లోపే.. కూటమి ఏం చేసిందో ప్రజలకు స్పష్టంగా అర్థం అవ్వాలి. అందుకే ఈనెల 15 నుంచి 20 మధ్యలోనే కూటమి నేతలు ప్రజల మధ్యకు రావాలి అనేది చంద్రబాబు ఉద్దేశం. మరి ఈ విషయంలో బీజేపీ ఎందుకు అంటి ముట్టనట్లు ఉంది. ఈ నేపథ్యంలో చంద్రబాబు ఎటువంటి నిర్ణయాలు తీసుకుంటారో చూడాలి.