ASBL Koncept Ambience
facebook whatsapp X

Chandra Babu New Strategy: కూటమి 200 కోసం బాబు ప్రణాళికలు.. కలెక్టర్ల కసరత్తు..

Chandra Babu New Strategy: కూటమి 200 కోసం బాబు ప్రణాళికలు.. కలెక్టర్ల కసరత్తు..

2024 ఎన్నికలు (2024 elections) పూర్తయ్యా.. రాష్ట్రంలో కూటమి ఏర్పడి ఇప్పటికి నాలుగు మాసాల పైనే గడుస్తోంది. ఎన్నికల సమయంలో ప్రజా ప్రభుత్వం (Praja Prabhutvam) అంటూ సరికొత్త ట్రెండ్ మొదలుపెట్టిన బాబు ప్రభుత్వం పై సామాన్యుల టాక్ ఎలా ఉంది అన్న విషయంపై సర్వత్రా ఆసక్తి నెలకొని ఉంది. అయితే ఈ ఆసక్తి కేవలం ప్రజలలోనే కాదు.. కూటమి సర్కారులో కూడా ఎక్కువగా కనిపిస్తోంది. మరోపక్క చంద్రబాబు (Chandra Babu ) ఎప్పటికప్పుడు తన గ్రాఫ్ ను అంచనా వేసుకుంటూ.. జాగ్రత్తగా ముందు అడుగు వేస్తున్నారు. 

అందుకే ఈ వంద రోజుల పాలనలో తమ పార్టీ పరిస్థితి ఎలా ఉంది.. ప్రజలు ఏమనుకుంటున్నారు.. అన్న విషయాలను ఎప్పటికప్పుడు కలెక్టర్ల ద్వారా రాబడుతూనే ఉన్నారు. అయితే కలెక్టర్లు ప్రభుత్వానికి వ్యతిరేకంగా అయితే స్టేట్మెంట్ ఇవ్వరు కదా.. అందుకే వారి దగ్గర నుంచి నిజా నిజాలు రాబట్టడానికి అభిప్రాయ సేకరణ కోసం కొన్ని మార్గదర్శకాలను కూడా సూచిస్తారట. వాటి ప్రకారం కూటమి ప్రభుత్వంపై సామాన్యుల సాటిస్ఫాక్షన్ ఏ రేంజ్ లో ఉంది అన్న విషయంపై ఓ నిర్ణయం తీసుకుంటారు..

కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ప్రజల సమస్యల పరిష్కారం ఏ రేంజ్ లో ఉంది అనేది మొదటి మార్గదర్శకం. ప్రభుత్వం ఏర్పడడానికి ముందు ఎన్నో సమస్యలు ఉన్నాయి అంటూ కూటమి ఎన్నికల సమయంలో జోరుగా ప్రచారం చేసింది. పైగా తమ ప్రభుత్వం వచ్చాక ఈ సమస్యలన్నీ పరిష్కరిస్తాము అని కూడా హామీలు ఇచ్చింది. ఈ నేపథ్యంలో ప్రతి ఎమ్మెల్యే, ఎంపీ ప్రజాదర్బార్లు (Praja Darbar) పెట్టి ప్రజల నుంచి వినతులు స్వీకరిస్తున్నారు. అంతేకాదు వీటి పరిష్కారానికి సంబంధించి ఎంతో సీరియస్ గా నిర్ణయాలు తీసుకుంటున్నారు.

ఇక రెండవది ప్రజలకు అందుతున్న ప్రభుత్వ సేవలు. ఈ సేవలన్నీ కూడా కలెక్టర్ల ద్వారానే ప్రజల వద్దకు వెళుతున్నాయి. కాబట్టి ఈ సేవలకు సంబంధించి ప్రజలు ఎలా రియాక్ట్ అవుతున్నారు.. వారికి ఇవి సరిగ్గా అందుతున్నాయా లేదా అనే విషయంపై సబ్ కలెక్టర్, కలెక్టర్, జాయింట్ కలెక్టర్లు క్షేత్రస్థాయిలో పరిశీలించి నివేదిక ఇవ్వాల్సి ఉంటుంది. ప్రస్తుతానికి కూటమి ప్రభుత్వం ఏర్పాటైన నాటి నుంచి ఇంటింటికి పెన్షన్ మాత్రమే అందుతుంది. బాబు షూరిటీ భవితకు గ్యారంటీ అంటూ ఇచ్చిన మిగిలిన హామీలు ఇంతవరకు కార్య రూపం దాల్చలేదు. పాఠశాలలో మధ్యాహ్న భోజన పథకం అమలు అవుతున్నప్పటికీ అది ఎప్పటినుంచో జరుగుతుంది కాబట్టి దాని గురించి పెద్దగా మాట్లాడాల్సిన అవసరం లేదు. అయితే కలెక్టర్లు ప్రజల నాడిని గమనించి ఇచ్చే నివేదికపై వచ్చే వంద రోజులకు చంద్రబాబు తన వ్యూహాన్ని సిద్ధం చేసుకోబోతున్నట్లు తెలుస్తోంది.

 

 

 

praneet praneet praneet ASBL Radhey Skye Radha Spaces
Tags :