ASBL Koncept Ambience
facebook whatsapp X

Chandra Babu: ఎన్టీఆర్ కోసం చంద్రబాబు ఆ పని చేస్తారా?

Chandra Babu: ఎన్టీఆర్ కోసం చంద్రబాబు ఆ పని చేస్తారా?

2024 ఎన్నికల అనంతరం ఆంధ్రాలో రాజకీయాలలో ఆసక్తికర మలుపులు చోటు చేసుకుంటున్నాయి. ప్రస్తుతం వైసీపీ (YCP) నుంచి మోపిదేవి వెంకట రమణ (Mopidevi Venkata Ramana), బీద మస్తాన్ రావు (Beeda Mastan Rao), ఆర్ క్రిష్ణయ్య ( R Krishnaiah) రాజీనామా చేయడంతో మూడు రాజ్యసభ సీట్లు ఖాళీ అయ్యాయి. ఈ నేపథ్యంలో ఈ సీట్లకు సంబంధించి అభ్యర్థులు ఎవరా అన్న విషయంపై కూటమిలో కసరత్తు ప్రారంభమైంది. వైసిపి నుంచి బయటకు వచ్చిన మోపిదేవి, బీద మస్తాన్ రావు పసుపు తీర్థం పుచ్చుకున్నారు. మరోపక్క ఆర్ క్రిష్ణయ్య కాషాయ కండువా ధరించారు. 

చంద్రబాబు బీదా మస్తాన్ రావు (Beeda Masthan Rao), మోపిదేవి వెంకటరమణకు (Mopidevi Venkata Ramana) కీలక పదవులు అప్పగిస్తామని మాట ఇచ్చినట్లు టాక్. ఇక ఆ విషయం పక్కన పెడితే ప్రస్తుతం ఖాళీ అయిన మూడు సీట్లలో రెండు టీడీపీ తీసుకొని ఒకటి జనసేనకు ఇవ్వడానికి చూస్తోంది. ఈ రెండు టీడీపీ సీట్లలో ఒకదానికి గల్లా జయదేవ్ (Galla Jayadev) పేరు స్ట్రాంగ్ గా వినిపిస్తోంది. మాజీ ఎంపీ.. అమర్ రాజా (Amar Raja) వ్యవస్థాపకుడు అయినా జయదేవుకు రాజ్యసభ సీటు దక్కే ఛాన్స్ కూడా గట్టిగానే కనిపిస్తోంది. ఇక టీడీపీ ఖాతాలో ఉన్న రెండవ సీటుకి చాలా ప్రముఖుల పేర్లు వినిపించాయి.

అయితే తాజాగా ఇప్పుడు ఆ స్థానంలో నందమూరి ఆడబడుచు అడుగు పెట్టబోతోంది అని తెలుస్తోంది. దివంగత నేత నందమూరి హరికృష్ణ (Nandamuri Hari Krishna) ఏకైక కుమార్తె అయిన నందమూరి సుహాసిని (Nandamuri Suhasini) రాజ్యసభకు పంపడానికి చంద్రబాబు ట్రై చేస్తున్నారని టాక్. సుహాసిని గత ఆరు సంవత్సరాలుగా తెలుగుదేశం పార్టీ కోసం పని చేస్తున్నారు. 2018లో తెలంగాణ ఎన్నికలలో ఆమె టిడిపి తరఫున కూకట్ పల్లి నుంచి పోటీ చేసి ఓడిపోయారు.

2024 ఎన్నికల సమయంలో కూడా ఆంధ్రాలో టీడీపీ.. కూటమి విజయం కోసం తన వంతు కృషి చేశారు. ప్రస్తుతం తెలంగాణలో సైకిల్ పవర్ తిరిగి తీసుకురావడానికి ప్రయత్నిస్తున్న చంద్రబాబు.. నందమూరి కుటుంబం (Nandamuri family) నుంచి సుహాసినిని రాజ్యసభకు పంపించాలి అని భావిస్తున్నారట. ప్రస్తుతానికి మీరు తెలుగు రాష్ట్రాలలో జూనియర్ ఎన్టీఆర్(Jr. NTR) .. చంద్రబాబుకు (Chandrababu) మధ్య పొంతన లేదు అన్న వాదన బలంగా వినిపిస్తోంది. 

ప్రస్తుతానికి ఈ విషయం అంత ప్రమాదకరం కాకపోయినప్పటికీ భవిష్యత్తులో ఈ విషయం సంచలనంగా మారే అవకాశం ఉంది. బయట వస్తున్న రూమర్స్ కి పుల్ స్టాప్ పెట్టడానికి.. భవిష్యత్తులో ఎన్టీఆర్ ను తమ పార్టీ వైపు తిప్పుకోవడానికి నారా, నందమూరి కుటుంబాలు ఒకటే అన్న విషయాన్ని ప్రజలకు తెలియపరచడానికి చంద్రబాబు ఈ నిర్ణయం తీసుకున్నారు అని టాక్. అయితే చంద్రబాబు నందమూరి సుహాసినిని రాజ్యసభకు పంపుతారా..లేక ఈ ఛాన్స్ మరొక నేతకు దక్కుతుందా అన్న విషయాన్ని చూడాలి.

 

 

 

praneet praneet praneet ASBL Radhey Skye Radha Spaces
Tags :