ASBL Koncept Ambience
facebook whatsapp X

తిరుమల ప్రసాదాల్లో కల్తీ నెయ్యి..! చంద్రబాబు దగ్గర ఆధారాలున్నాయా..?

తిరుమల ప్రసాదాల్లో కల్తీ నెయ్యి..! చంద్రబాబు దగ్గర ఆధారాలున్నాయా..?

తిరుమల (Tirumala) ప్రసాదాల్లో జంతువుల కొవ్వుతో చేసిన నూనె వాడారంటూ ఏపీ సీఎం చంద్రబాబ నాయుడు (Chandrababu Naidu) చేసిన కామెంట్స్ ఇప్పుడు సంచలనం కలిగిస్తున్నాయి. తిరుమల హిందువులకు అత్యంత పవిత్రమైన ప్రదేశం. తిరుమల ప్రసాదాలకు (Tirumala Prasadams) విశేష గుర్తింపు ఉంది. అలాంటి ప్రసాదాల్లో అపవిత్రమైన జంతు మాంసపు కొవ్వుతో (Animal Fat) చేసిన నెయ్యిని వాడారంటూ సాక్షాత్తూ సీఎం ప్రకటించడం తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. చంద్రబాబు కామెంట్స్ పై వైసీపీ (YCP) ఎదురుదాడి ప్రారంభించింది. అలాంటిదేం లేదని.. తాము ప్రమాణాలకు సిద్ధమని.. చంద్రబాబు కూడా ప్రమాణం చేస్తారా అని సవాల్ విసురుతోంది.

చంద్రబాబు కామెంట్స్ వైసీపీలో కలకలం రేపాయి. జగన్ అధికారంలో ఉన్నప్పుడు మొదట తన బంధువైన వైవీ సుబ్బారెడ్డి (YV Subba Reddy) టీటీడీ ఛైర్మన్ (TTD Chairman) గా ఉన్నారు. ఆ తర్వాత భూమన కరుణాకర్ రెడ్డికి (Bhumana Karunakar Reddy) అవకాశం దక్కింది. అదే సమయంలో ఈఓ మొదలు కీలక స్థానాల్లో అందరూ తన అనుయాయులే ఉన్నారు. అప్పటి  టీటీడీ పాలకమండలి (TTD board) తీసుకున్న పలు నిర్ణయాలు వివాదాస్పదమయ్యాయి. అలాంటి వాటిలో కర్నాటకకు చెందిన నందిని (Nandini Ghee) నెయ్యి కాకుండా తమిళనాడు నుంచి నెయ్యి కొనడం తీవ్ర వివాదాస్పదమైంది. అయితే వాటిని పట్టించుకోకుండా టీటీడీ పాలకమండలి, వైసీపీ ప్రభుత్వం ముందుకెళ్లింది.

గతంలో చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడు పింక్ డైమండ్ పై (Pink Daimond) వైసీపీ నానా రాద్ధాంతం చేసింది. అప్పట్లో దీనిపై విచారణ జరిపించాలంటూ పెద్దఎత్తున డిమాండ్ చేసింది. సుబ్రమణ్యస్వామి (Subramanya Swamy) లాంటి వాళ్లు కూడా దీనిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అంతేకాదు.. వకుళామాత ఆలయం (Vakulamatha Temple) వద్ద గుప్తనిధులను చంద్రబాబు కాజేశారని ఆరోపించారు. అయితే వైసీపీ అధికారంలోకి వచ్చాక వీటి జోలికి పోలేదు. అప్పుడు చేసిన ఆరోపణలపై నోరు మెదపలేదు. విచారణ జరపలేదు. దీంతో ఆ ఆరోపణల్లో వాస్తవం లేదని తేలిపోయింది. కానీ ఇప్పుడు చంద్రబాబు అధికారంలో ఉండి ఈ కామెంట్స్ చేశారు. దీంతో వైసీపీ ఒక్కసారిగా ఉలిక్కి పడుతోంది.

తిరుమల పవిత్రతను కాపాడేందుకు కృషి చేశామని.. దీనిపై ప్రమాణం చేసేందుకు తాను సిద్ధమని టీటీడీ మాజీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి అన్నారు. భూమన కరుణాకర్ రెడ్డి మాత్రం కల్తీ నెయ్యిపై మాట్లాడకుండా చంద్రబాబు ఇంతేనని, నీచ రాజకీయాలు చేస్తారని విమర్శించారు. అయితే చంద్రబాబు జూన్ లో బాధ్యతలు చేపట్టిన తర్వాత శ్యామలరావును (TTD EO Syamala Rao) ఈవోగా నియమించారు. ప్రసాదాల్లో నాణ్యత లోపించిందని ఆయనకు ఫిర్యాదులు వచ్చాయి. దీంతో ఆయన నెయ్యిని NABLకు పంపించారు. ఆ సంస్థ చేసిన పరీక్షల్లో ఒక సరఫరాదారు పంపించిన నెయ్యి ప్రమాణాలకు అనుగుణంగా లేదని తేలింది. అంతేకాక అది కల్తీ (Adulterated Ghee) అని నిర్దారించింది. దీంతో ఆ సరఫరాదారుకు టీటీడీ నోటీస్ ఇచ్చింది. కాంట్రాక్ట్ రద్దు చేసుకుంటామని హెచ్చరించింది. నెయ్యిలో కల్తీ పదార్థాలేంటనేది బయటకు రాలేదు. అయితే చంద్రబాబుకు మాత్రం అందులో కలిపింది జంతువుల కొవ్వు నూనే అని సమాచారం ఉందని.. అందుకే ఆయన ఇలా మాట్లాడారని ఆయన సన్నిహితులు చెప్తున్నారు. ఒకవేళ ప్రభుత్వం దీనిపై విచారణ జరిపితే వైసీపీ నేతలు ఇరుక్కుపోవడం ఖాయమని చెప్పుకుంటున్నారు. చంద్రబాబు పక్కా ఆధారాలు పెట్టుకునే ఇలా మాట్లాడారని స్పష్టం చేస్తున్నారు.

 

 

 

praneet praneet praneet ASBL Radhey Skye Radha Spaces
Tags :