ASBL Koncept Ambience
facebook whatsapp X

భవిష్యత్తులో దేశానికైనా, కంపెనీకైనా అదే కీలకం : చంద్రబాబు

భవిష్యత్తులో దేశానికైనా, కంపెనీకైనా అదే కీలకం : చంద్రబాబు

డ్రోన్‌ టెక్నాలజీ భవిష్యత్తులో గేమ్‌ ఛేంజర్‌ కానుందని ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. మంగళగిరిలోని సీకే కన్వెన్షన్‌లో నిర్వహించిన అమరావతి డ్రోన్‌ సమ్మిట్‌ ప్రారంభోత్సవ కార్యక్రమంలో చంద్రబాబు మాట్లాడారు. ఇటీవల విజయవాడ వరదల్లో  డ్రోన్లు వినియోగించి  ఆహారం, తాగునీరు అందించామని తెలిపారు. ఐటీ, నాలెడ్జ్‌ ఎకానమీలో భారతీయులు చాలా సమర్థులని అన్నారు. 1995లో తొలిసారి సీఎం అయ్యాక హైదరాబాద్‌లో ఐటీ రంగం అభివృద్ధికి కృషి చేశానని, ఆ రోజుల్లోనే పీపీపీ పద్ధతిలో హైటెక్‌ సిటీని నిర్మించామన్నారు. అమెరికా వెళ్లి 15 రోజులపాటు అనేక సంస్థల ప్రతినిధులను కలిసినట్లు గుర్తు చేశారు.  నివాస అనుకూల నగరాల్లో దేశంలోనే బెస్ట్‌ సిటీ హైదరాబాద్‌ అని చెప్పారు. విదేశాల్లో ఉన్న మనదేశ ఐటీ నిపుణుల్లో 30 శాతం తెలుగువారే ఉన్నారని తెలిపారు.

ఇప్పుడు నిజమైన సంపద డేటా. భవిష్యత్తులో దేశానికైనా, కంపెనీకైనా అదే కీలకం. డేటాకు ఏఐను అనుసంధానిస్తే అద్భుతాలు సృష్టించవచ్చు.వ్యవసాయం, మౌలిక వసతుల రంగంలో వాటిది కీలకపాత్ర. నగరాల్లో ట్రాఫిక్‌ నియంత్రణకు వాడొచ్చు. భవిష్యత్తులో వైద్యరంగంలో పెనుమార్పులు రానున్నాయి. రోగులు ఇంటివద్దే ఉండి చికిత్స తీసుకోవచ్చు. కొన్ని దేశాలు యుద్ధాల్లో  డ్రోన్లు వాడుతున్నాయి. మేం మాత్రం అభివృద్ధికి ఉపయోగిస్తాం. శాంతిభద్రతల పరిరక్షణకు వినియోగిస్తాం. పోలీసుశాఖలో విస్తృతంగా ఉపయోగించేందుకు కృషి చేస్తాం. డ్రోన్లతో రౌడీషీటర్ల కదలికలపై నిఘా ఉంచి వారికి చెక్‌ పెడతాం అని తెలిపారు.
 

 

 

 

praneet praneet praneet ASBL Radhey Skye Radha Spaces
Tags :