ASBL Koncept Ambience
facebook whatsapp X

Chandrababu: రేపటి నుంచి చంద్రబాబు క్లాసులు..!

Chandrababu: రేపటి నుంచి చంద్రబాబు క్లాసులు..!

ఆంధ్రప్రదేశ్ (AP)లో ఐదేళ్ల తర్వాత అదికారంలోకి రావడంతో టీడీపీ (TDP) శ్రేణులు ఫుల్ జోష్ లో ఉన్నాయి. గత ఐదేళ్లు వైసీపీ (YSRCP) ప్రభుత్వంలో ఎన్నో ఇబ్బందులు పడిన తెలుగు తమ్ముళ్లు (TDP Leaders).. ఇప్పుడు తమ పార్టీ పవర్ లోకి రావడంతో అంతా తాము చెప్పినట్టే జరుగుతుందనుకున్నారు. అయితే మొదటి నాలుగు నెలల్లో తెలుగు తమ్ముళ్లు ఆశించినంతగా చంద్రబాబు పాలన లేదు. దీంతో బహిరంగంగానే సోషల్ మీడియా (social media) వేదికగా చంద్రబాబును (CM Chandrababu) విమర్శిస్తూ టీడీపీ శ్రేణులు పోస్టులు పెడుతున్నాయి. అయితే ఇప్పుడు ఇలాంటి తమ్ముళ్లందరినీ పిలిచి క్లాస్ పీకబోతున్నారు చంద్రబాబు.

గత ఐదేళ్లూ జగన్ (YS Jagan) ప్రభుత్వం టీడీపీ (TDP) శ్రేణులను పూర్తిగా అణగదొక్కింది. చాలా మంది కేసులు ఎదుర్కొన్నారు. కొంతమంది జైలుకెళ్లారు. మరికొందరు ఆర్థికంగా నష్టపోయారు. అయినా ఎన్నికల్లో ఎదురొడ్డి పోరాడారు. అధికారంలోకి వస్తే మీ సంగతి చూస్తామంటూ తమ ప్రత్యర్థులను హెచ్చరించారు. ఇప్పుడు అధికారంలోకి వచ్చారు. అయినా తమ శత్రువులను, తమను ఇబ్బంది పెట్టిన వైసీపీ నేతలు, అధికారులు, పోలీసులను ఏమీ చేయలేకపోతున్నారు. ఫలనా వాళ్లు మమ్మల్ని ఇబ్బంది పెట్టారు.. చర్యలు తీసుకోండి అని పార్టీ హైకమాండ్ దృష్టికి తీసుకెళ్లినా చంద్రబాబు, లోకేశ్ (Lokesh) పట్టించుకోవట్లేదు. దీంతో చాలామంది తీవ్ర అసహనంతో ఉన్నారు.

ఇది ఒక యాంగిల్ అయితే.. మరోవైపు అధికారంలోకి వచ్చి 4 నెలలు కాకముందే తెలుగుదేశం నేతలపై అవినీతి (corruption) ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఇసుకను (sand) మాయం చేశారని.. కోట్లు కొట్టేశారని వైసీపీ ఆరోపిస్తోంది. మద్యం (liquor) దుకాణాలకోసం సిండికేట్ గా మారడం, షాపులు దక్కించకున్నవాళ్లను బెదిరించడం లాంటివి వెలుగులోకి వచ్చాయి. మరోవైపు జిల్లాల్లో వ్యాపారుల నుంచి కమీషన్లు వసూలు చేస్తున్నారని ఫిర్యాదులు అందుతున్నాయి. ఇలాంటివాటిపై చంద్రబాబు తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. ఆరంభంలోనే ఇలాంటి వ్యతిరేకత రావడాన్ని చంద్రబాబు సహించలేకపోతున్నారు. అందుకే వాళ్లందరినీ పిలిచి క్లాస్ పీకాలని నిర్ణయించుకున్నారు.

రేపటి నుంచి ఈ నెలాఖరు వరకూ చంద్రబాబు దశలవారీగా పార్టీ జిల్లా అధ్యక్షులు, నియోజకవర్గనేతల నుంచి మండలస్థాయి నేతల వరకూ సమావేశం కాబోతున్నారు. పార్టీ నియమ నిబంధనలను గుర్తు చేయనున్నారు. కక్షసాధింపు చర్యలకు, అవినీతి, అక్రమాలకు దూరంగా ఉండాలని హితవు చెప్పబోతున్నారు. జగన్ లాగా కక్ష సాధించే ఉద్దేశం తనకు లేదని.. ఏదైనా చట్టప్రకారమే వ్యవహరిస్తామని క్లారిటీ ఇవ్వబోతున్నారు. చట్ట వ్యతిరేక పనులు చేస్తే చిక్కుల్లో పడతామని.. ఈ విషయాన్ని అర్థం చేసుకుని నేతలు మసలుకోవాలని వార్నింగ్ ఇవ్వబోతున్నారు. అవినీతి, అక్రమాలకు పాల్పడి పార్టీకి చెడ్డపేరు తెస్తే సహించేదిలేదని చెప్పబోతున్నారు చంద్రబాబు. తమతో చంద్రబాబు నేరుగా మాట్లాడబోతున్నారని నేతలు ఓ వైపు సంబరపడుతున్నారు. అయితే తమను శాంతింపజేసేందుకే ఈ సమావేశాలు పెడుతున్నారని తెలిసి ఒకింత అసంతృప్తితో ఉన్నారు.

 

 

praneet praneet praneet ASBL Radhey Skye Radha Spaces
Tags :