ASBL Koncept Ambience
facebook whatsapp X

Chandrababu on drone : డ్రోన్ టెక్నాలజీ బెస్ట్ అంటున్న చంద్రబాబు..

Chandrababu on drone : డ్రోన్ టెక్నాలజీ బెస్ట్ అంటున్న చంద్రబాబు..

ఆంధ్ర రాష్ట్ర చరిత్రలో (AP) కనివిని ఎరుగని విధంగా అమరావతిలో డ్రోన్ సమ్మిట్ (Drone Summit) జరుగుతుంది. 2024 ఎన్నికల అనంతరం ఏపీలో ఎన్డీఏ (NDA) ప్రభుత్వం గెలిచిన తరువాత.. ఈ డ్రోన్ సమ్మిట్ ఏర్పాటు చేయడం విశేషం. లోకేష్ నియోజకవర్గమైన మంగళగిరిలో (Mangalagiri) అమరావతి (Amaravathi) డ్రోన్ సమ్మిట్ 2024 (Drone Summit 2024) కార్యక్రమాన్ని అట్టహాసంగా ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు (Chandrababu) ప్రారంభించారు.

ఈ సదస్సులో మాట్లాడుతూ చంద్రబాబు (Chandrababu) కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. ఇటువంటి కార్యక్రమాన్ని అమరావతిలో (Amaravathi) చేయడం ఎంతో ఆనందంగా ఉంది అని అన్నారు. ఉమ్మడి ఆంధ్ర రాష్ట్రంలో రాజధానిగా ఉన్న హైదరాబాదును అప్పట్లో ఐటీ హబ్ గా అభివృద్ధి చేయడానికి తాను ఎంతగా కృషి చేశాను అన్న విషయాన్ని మరొకసారి ఈ సందర్భంగా చంద్రబాబు గుర్తు చేసుకున్నారు. అంతేకాదు ఆనాడు హైదరాబాదులో ఐటీ రంగాన్ని (Hyderabad IT) అభివృద్ధి చేయడం కోసం.. బెంగళూరు (Bangalore) తో పోటీపడే విధంగా తీర్చిదిద్దడం కోసం ఎంతో కష్టపడ్డానని పేర్కొన్నారు. అప్పట్లో 15 రోజుల పాటు అమెరికాలో ఉంటూ అనేక సంస్థలను కలిసి రావడం జరిగిందని.. ఆ రోజుల్లోనే ఐటీ నాలెడ్జ్ ఎకానమీలో భారతీయులు ఎంతో సమర్థవంతులని విదేశీయులు సైతం కొనియాడారని.. ఇప్పుడు విదేశాలలో ఉన్న ఐటీ నిపుణులలో 30% కు పైగా తెలుగువారని చెప్పుకొచ్చారు.

ఇక విజయవాడ ను ముంచేత్తిన వరదల సమయంలో డ్రోన్లను ఉపయోగించి వరద బాధితులకు నిత్యవసరాలను అందించడం జరిగిందని అన్నారు. అంతేకాదు వ్యవసాయం, మౌలిక వసతుల అందుబాటు వ్యవహారాల్లో కూడా డ్రోన్లది కీలక పాత్ర అని చంద్రబాబు పేర్కొన్నారు. పెరుగుతున్న టెక్నాలజీ కారణంగా భవిష్యత్తులో వైద్యరంగంలో కూడా ఎన్నో మార్పులు చోటుచేసుకుంటాయని.. ఇంటి వద్ద నుంచే చికిత్స తీసుకునే అవకాశం కూడా వస్తుందంటూ పేర్కొన్నారు. అన్ని రంగాల్లోకి డ్రోన్ టెక్నాలజీ ఒక గేమ్ చేంజర్ గా మారబోతోందని చంద్రబాబు అభిప్రాయపడ్డారు. నగరాల్లో భారీ ట్రాఫిక్ నియంత్రణ దగ్గర నుంచి.. శాంతిభద్రతల పర్యవేక్షణ వరకు డ్రోన్ కెమెరాలను వాడవచ్చని.. ఈ టెక్నాలజీని అభివృద్ధి చేయడం ద్వారా ఎన్నో రకాల ఫలితాలను పొందవచ్చని పేర్కొన్నారు.

 

 

 

praneet praneet praneet ASBL Radhey Skye Radha Spaces
Tags :