ASBL Koncept Ambience
facebook whatsapp X

చంద్రబాబు - పవన్‌ మధ్య ఫెవికాల్ బంధం..!?

చంద్రబాబు - పవన్‌ మధ్య ఫెవికాల్ బంధం..!?

ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh)లో టీడీపీ (TDP) అధికారంలోకి రావడానికి పవన్ కల్యాణ్ (Pawan Kalyan) పాత్ర ఎంతో కీలకం అనే విషయం తెలిసిందే. టీడీపీతో కలిసి వెళ్లేందుకు పవన్ కల్యాణ్ సిద్ధమైనా బీజేపీని (BJP) కూడా కలుపుకుపోదాం అని ఆయన సూచించారు. ఇందుకు చంద్రబాబు (Chandrababu) సుముఖత వ్యక్తం చేయడం, బీజేపీని ఒప్పించడం లాంటివన్నీ పవన్ దగ్గరుండి చూసుకున్నారు. అందుకే కూటమి (NDA Alliance) ఘనవిజయం సాధించి అధికారంలోకి వచ్చింది. జగన్ (YS Jagan) పైనున్న కోపమే పవన్ ను టీడీపీ, బీజేపీ (BJP) దగ్గరకు చేసిందనడంలో ఎలాంటి సందేహం లేదు. అయితే ఇప్పుడు చంద్రబాబుపై మాత్రం పవన్ అమితమైన ప్రేమ కనబరుస్తుండడం ఆశ్చర్యం కలిగిస్తోంది.

కూటమి ప్రభుత్వం వంద రోజులు పూర్తి చేసుకున్న సందర్భంగా మూడు పార్టీలు తమ ఎమ్మెల్యేలతో (MLAs) ఉమ్మడి సమావేశం నిర్వహించాయి. ఇందులో మాడు పార్టీల అధినేతలు ప్రసంగించారు. ఈ ప్రసంగాల్లో పవన్ కల్యాణ్ ది అత్యంత ఆసక్తి కలిగించింది. పవన్ తన ప్రసంగంలో ఎక్కువగా చంద్రబాబును ఉద్దేశించే చెప్పారు. ఆయన్ను విపరీతంగా పొగిడేశారు. ఆయన్ను చూసి తాను చాలా నేర్చుకుంటున్నానని చెప్పారు. కళ్ల ముందు పెద్ద సమస్య ఉన్నా ఆయన చాలా కూల్ గా దాని పరిష్కారం గురించి ఆలోచిస్తుంటారని చెప్పారు. వరదల (Floods) సమయంలో పాతికేళ్ల యువకుడిలా బురదలో నడుస్తుంటే కొందరు విమర్శిస్తున్నారన్నారు. కానీ అందరం ఆయన మంచి పనులను గుర్తించి అండగా ఉందాం అని సహచర ఎమ్మెల్యేలకు పవన్ కల్యాణ్ పిలుపునిచ్చారు.

కూటమి అధికారంలోకి రాగానే చంద్రబాబు సీఎంగా, పవన్ కల్యాణ్ డిప్యూటీ సీఎంగా (Deputy CM) ప్రమాణం చేశారు. ఆ తర్వాత ప్రభుత్వ కార్యక్రమాలకు సంబంధించిన వాటిలో డిప్యూటీ సీఎం ఫోటో వాడట్లేదని కొంతమంది జనసైనికులు రచ్చ చేయడం మొదలు పెట్టారు. వరదల సమయంలో జనసేన మంత్రి నాదెండ్ల మనోహర్ (Nadendla Manohar) ను చంద్రబాబు మందలించారని.. ఆ రెండు పార్టీల మధ్య గ్యాప్ పెరిగిపోయిందని చెప్పుకొచ్చారు. నామినేటెడ్ పదవుల (Nominated Posts) విషయంలో రెండు పార్టీల మధ్య ఏకాభిప్రాయం కుదరలేదని.. అందుకే ఆలస్యమవుతోందని ప్రచారం జరుగుతోంది.

అయితే రియాలిటీ వేరుగా ఉన్నట్టు పవన్ కల్యాణ్ మాటలను బట్టి అర్థమవుతోంది. కూటమిలోని మూడు పార్టీల మధ్య మంచి సంబంధ బాంధవ్యాలున్నాయని నిన్నటి సమావేశం రుజువు చేసింది. ఏదైనా చిన్నాచితకా సమస్యలు వచ్చినా అవి కిందిస్థాయిలో మాత్రమే ఉండొచ్చని.. పై స్థాయి నేతల్లో మాత్రం అలాంటివేమీ ఉండట్లేదని తేలింది. మున్ముందు కూడా అందరం ఇలాగే కలిసి ఉండాలని చంద్రబాబు కోరుకున్నారు. అంటే వాళ్ల ప్రయాణం సాఫీగా సాగుతోందని అర్థమవుతోంది. ఇందుకోసం పవన్ కల్యాణ్ తాను సిద్ధంగా ఉన్నట్టు వెల్లడించారు. దీన్ని బట్టి ఆ రెండు పార్టీల మధ్య ఫెవికాల్ బంధం (Fevicol Bonding) ఏర్పడిందని గుసగుసలాడుకుంటున్నారు.

 

 

 

praneet praneet praneet ASBL Radhey Skye Radha Spaces
Tags :