ASBL Koncept Ambience
facebook whatsapp X

విజయవాడ వరదల్లో చంద్రబాబు ప్లానింగ్.. ఇది కదా అసలు రాజకీయం అంటే..

విజయవాడ వరదల్లో చంద్రబాబు ప్లానింగ్.. ఇది కదా అసలు రాజకీయం అంటే..

చంద్రబాబు అంటేనే రాజకీయం.. రాజకీయం అంటేనే చంద్రబాబు. ఈ విషయం తెలుగు రాష్ట్రాలలో ఎవరిని అడిగిన టక్కున చెబుతారు. రాజకీయాలలో అపర చాణిక్యుడుగా చంద్రబాబుకు ఎందుకు గుర్తింపు ఉంది అనడానికి విజయవాడ వరదలు మరొకసారి సాక్ష్యంగా నిలుస్తున్నాయి. వరద సంక్షోభాన్ని తన పార్టీ సంక్షేమానికి చంద్రబాబు ఉపయోగించిన విధానం నిజంగా ప్రశంసించదగినది. ఓపక్క ప్రజలకు మంచి చేస్తూ మరో పక్క పార్టీ పునాదులను పటిష్టం చేసుకున్న వైనం అందరిని ఆశ్చర్యపరుస్తుంది. 

అధికారంలో ఉన్నవారు సామాన్యంగా నిధుల వర్షం కురిపించరు. వరదలు, ఉప్పెనలు, తుఫానులు.. ఇవి సహజంగా మన రాష్ట్రాలలో సంభవిస్తూనే ఉంటాయి. అయితే ఇప్పటివరకు ఎప్పుడు లేని రీతిలో చంద్రబాబు విజయవాడ వరద బాధితుల కోసం పరితపించిన తీరు.. నిధుల వర్షం కురిపించిన వైనం ప్రజలలో ఆయనకు ఎక్కడలేని మాస్ ఇమేజ్ తెచ్చి పెట్టింది. ఇక్కడ మనం గత ప్రభుత్వం చేసిన కొన్ని అంశాల గురించి చర్చించుకోవాలి..ఇప్పుడు ఉదాహరణకి అమరావతి విషయం తీసుకోండి.. నేను పట్టిన కుందేలుకి మూడే కాళ్లు అన్నట్టు.. అమరావతి విషయం లో జగన్ పెద్ద ఎత్తున మంకు పట్టు పట్టారు. తాను అందిస్తున్న పథకాలతో ప్రజలకు కుష్ అవుతున్నారని. గెలుపు తనదే అని ధీమాగా ఉన్నారు .ఐదు సంవత్సరాలలో ఏమీ జరగదు అని భావించారు.. కానీ ఆఖరికి ప్రజలు ఎన్నికల్లో తమ తీర్పుని కూటమివైపు ప్రకటించారు. ఇక వరదలు లాంటివి వైసీపీ హయాంలో కూడా వచ్చాయి. అయితే జగన్ తన ఐదేళ్ల కాలాన్ని పరదాల చాటున, హెలికాప్టర్ పైన గడిపేసారు. 

బాధలో ఉన్న వారిని పరామర్శించడానికి కూడా రాలేకపోయారు. అయితే ఈ వయసులో చంద్రబాబు కుర్రవాళ్ళకంటే యాక్టివ్గా వరద ప్రాంతాలలో.. బురదలో ప్రజల కోసం పాటుపడ్డారు. ఎప్పుడూ లేనిది బాబును చూసి జగన్ కూడా వరదల్లో ప్రజల మధ్యకు రావాల్సి వచ్చింది.దీంతో బాబుపై ప్రజలకు మంచి అభిప్రాయం ఏర్పడింది. ఇక విజయవాడ వాసులకు అందించే సహాయం విషయంలో కూడా ఎంతో ఉదారత చూపించి బాబు వాళ్ళ మనసులను గెలుచుకున్నారు. వరద విలయంలో నష్టపోయిన రైతన్నలను చంద్రబాబు ఆదుకున్న తీరు పై అందరూ హర్షం వ్యక్తం చేస్తున్నారు. దీంతో ఇప్పటివరకు రాజకీయపరంగా చంద్రబాబుపై ఉన్న ఎన్నో అనుమానాలు తీరిపోయాయి.. జగన్ ఇకనైనా ఈ విషయంలో మేలుకొని ముందస్తు చర్యలు చేపట్టకపోతే వచ్చే ఎన్నికల్లో తీవ్రమైన కష్టాలు ఎదుర్కోవడం ఖాయం అంటున్నారు విశ్లేషకులు.

 

 

 

praneet praneet praneet ASBL Radhey Skye Radha Spaces
Tags :