ASBL NSL Infratech
facebook whatsapp X

ఆ అధికారులను వదిలిపెట్టను ... సీఎం చంద్రబాబు హెచ్చరిక

ఆ అధికారులను వదిలిపెట్టను ... సీఎం చంద్రబాబు హెచ్చరిక

అక్రమాలకు పాల్పడిన అధికారులను వదిలేది లేదని ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు హెచ్చరించారు. మంగళగిరిలో టీడీపీ కేంద్ర కార్యాలయంలో ప్రజల నుంచి వినతులు స్వీకరించిన అనంతరం చంద్రబాబు మీడియాతో మాట్లాడారు. వినతులు అన్నింటిని పరిష్కరించడమే తమ లక్ష్యమన్నారు. రెవెన్యూ సంబంధిత సమస్యలపైనే అధికంగా ఫిర్యాదులు వచ్చాయన్నారు. ఈ సమస్యలకు కారణమైన అధికారులపై చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. వైసీపీ కారణంగా ప్రతి మండలంలోనూ ఓ భూకుంభకోణం వెలుగు చూస్తోందని తెలిపారు. రికార్డులను కూడా తారుమారు చేశారని ఆరోపించారు. రీసర్వే అస్తవ్యస్తంగా జరగడం వల్లే ప్రజలకు ఇబ్బందులు వస్తున్నాయి. ప్రతి జిల్లాలో రెవెన్యూ సంబంధిత ఫిర్యాదుల స్వీకరణకు ప్రాధాన్యం ఇస్తాం. రెవెన్యూ శాఖను గత ప్రభుత్వం నిర్వీర్యం చేశారు. మదనపల్లె ఘటనే రెవెన్యూ శాఖ నిర్వీర్యానికి ఉదాహరణ. వ్యవస్థలను 100 రోజుల్లో గాడిన పెడతాం. రెవెన్యూ శాఖను ప్రక్షాళన చేస్తా. భూ కబ్జాదారులపై కఠిన చర్యలు తీసుకుంటాం. సమస్యలను  విభాగాల వారీగా విభజించి పరిష్కరిస్తాం. వినతులు ఇచ్చేందుకు అమరావతి రాకుండా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తాం. నియోజకవర్గాలు, జిల్లాల్లో ఫిర్యాదులు తీసుకునేలా ఏర్పాట్లు చేస్తాం. నా పర్యటనల వల్ల ఎవరూ ఇబ్బందిపడకుండా మార్పులు తెస్తాం. శాఖల వారీగా సమీక్షలు సత్ఫలితాలు ఇస్తున్నాయి అని తెలిపారు.
 

 

 

praneet praneet praneet ASBL Radhey Skye Radha Spaces
Tags :