ASBL NSL Infratech
facebook whatsapp X

హూ కిల్డ్ బాబాయ్..? మళ్లీ వార్ మొదలు పెట్టిన చంద్రబాబు..

హూ కిల్డ్ బాబాయ్..? మళ్లీ వార్ మొదలు పెట్టిన చంద్రబాబు..

కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 50 రోజులలో 36 హత్యలు జరిగాయి అంటూ వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి ఆరోపిస్తున్నారు. ఇక దీనిపై చంద్రబాబు ఘాటుగా స్పందించడంతోపాటు హూ కిల్డ్ బాబాయ్ నినాదాన్ని తిరిగి తెరమీదకు తీసుకువస్తున్నారు. రోజురోజుకి హీట్ ఎక్కుతున్న ఈ మాటలు యుద్ధం ఎంత వరకు వెళ్తుందో ఎవరికీ అర్థం కావడం లేదు. జగన్ తనపై చేస్తున్న విమర్శలకు మండిపడ్డ చంద్రబాబు ఋషిఖండలో 500 కోట్లు పెట్టి భవనాలు కట్టావు.. ప్రజాధనాన్ని నీ విలాసం కోసం వినియోగించడంతోపాటు 36 మందిని చంపేశాను అని నిందలు వేస్తున్నావు.. సరే ఆ పేర్లు ఏమో చెప్పండి అంటే పారిపోతావు.. ఇదేనా నీకు తెలిసిన రాజకీయం అని జగన్ ని టార్గెట్ చేస్తున్నారు. 

2019లో 151 సీట్లు గెలిచి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన జగన్ ప్రజలకు నమ్మకద్రోహం చేసి ప్రస్తుతం ప్రజలను దిక్కుతోచని స్థితిలో వదిలేసాడని.. అందుకే ప్రజలు తమ సంపూర్ణ మద్దతు కూటమి ప్రభుత్వానికి ఇచ్చారని చంద్రబాబు పేర్కొన్నారు. ప్రభుత్వంలో జరిగిన అన్యాయం ఏంటో ప్రజలకు తెలియాలి అనే ఉద్దేశంతో మేము శ్వేత పత్రాలు విడుదల చేసాం.. మరోపక్క రాష్ట్రాన్ని ముందుకు తీసుకు వెళ్లే ప్రయత్నాలు కూడా చేస్తున్నాం.. అని జగన్ మీడియా సమావేశంపై స్పందించిన చంద్రబాబు పేర్కొన్నారు.

వినుకొండలో హంతకుడు ఏ పార్టీకి చెందిన వాడు? హత్య చేయబడిన వ్యక్తిది ఏ పార్టీ? మొన్నటి వరకు అతను మీ పార్టీలో లేడా? 36 మంది చనిపోయారు అంటున్నప్పుడు వాళ్ళ పేర్లు చెప్పడానికి ఏమిటి బాధ? మీరు చెప్పిన సంఖ్యలో నిజాయితీ ఉంటే పేర్లు కూడా చెప్పండి? అంటూ జగన్ పై ప్రశ్నల వర్షం కురిపించారు. అంతేకాదు నువ్వు చంపిన వాళ్ల పేర్లు కూడా నేనే ఇస్తాను.. తిరిగి మళ్ళీ కేసులు రీ ఓపెన్ చేయిస్తాను సిద్ధమేనా అని ఓపెన్ సవాల్ విసిరారు. బాబాయ్ హంతకుల్ని పట్టుకోవాల్సిన బాధ్యత నాపై ఉంది అని చెప్పిన బాబు వడ్డీతో సహా అన్ని చెల్లిస్తానని పేర్కొన్నారు. 

ప్రజాస్వామ్యం అంటే ఏదో తమాషాగా తీసుకుంటున్న వాళ్లకి.. రాజకీయ ముసుగులో ఎదురు దాడి చేయాలి అని భ్రమ పడుతున్న వాళ్లకి తానేంటో చూపిస్తానని చంద్రబాబు విరుచుకుపడ్డారు. అంతేకాదు ముచ్చుమర్రిలో జరిగిన బాలిక దారుణ హత్య విషయంలో హిందువులను అరెస్టు చేశామని అయినా కానీ ఎటువంటి యాక్షన్ తీసుకోలేదని అబద్ధాలు చెబుతున్నారని చంద్రబాబు పేర్కొన్నారు. దీంతో అందరూ అనవసరంగా జగన్ తనని తాను ఇబ్బందుల్లో పడవేసుకుంటున్నాడని అందరూ భావిస్తున్నారు.

 

 

 

praneet praneet praneet ASBL Radhey Skye Radha Spaces
Tags :