ASBL Koncept Ambience
facebook whatsapp X

అదానీ విషయంలో చంద్రబాబు మౌనం.. అసలు కారణం అదేనా? 

అదానీ విషయంలో చంద్రబాబు మౌనం.. అసలు కారణం అదేనా? 

ప్రస్తుతం ఎక్కడ చూసినా అదానీ గ్రూప్ గురించి తీవ్రంగా చర్చలు జరుగుతున్నాయి. ఏపీలో ఈ సెగ మరీ ఎక్కువగా కనిపిస్తోంది. ముఖ్యంగా జగన్ కూడా ముడుపులు తీసుకున్నారు అంటూ వచ్చిన వార్తలు.. అమెరికాలో నమోదైన కేసుల నేపథ్యంలో ఆంధ్ర రాష్ట్ర రాజకీయాలు కాస్త వేడెక్కాయి. ఈ విషయంపై కూటమి నేతలు తీవ్రంగా స్పందిస్తున్నారు. అయితే అందరికంటే దూకుడుగా ముందుండి మాట్లాడాల్సిన చంద్రబాబు మాత్రం ఎందుకో ఆచితూచి అడుగులు వేస్తున్నట్లు కనిపిస్తోంది. వాస్తవానికి అదానీ వంటి సంస్థలు ఏ పని చేసినా చాలా పక్కాగా చేస్తాయి. ఏమాత్రం చిన్న తప్పు జరిగినా బ్రాండ్ ఇమేజ్ పోతుంది అన్న భయంతో తొందరపడి ఏ పని చేయవు. కానీ ప్రస్తుతం పెరుగుతున్న పోటీ వాతావరణం, రాజకీయ వత్తిళ్ల కారణంగా కార్పొరేట్లలో కూడా ముడుపుల సిస్టం మొదలైంది. ఇక గౌతమ్ అదానీ నుంచి జగన్ ముడుపులు తీసుకున్నారా లేదా అన్న విషయం విచారణలో తెలిసిపోతుంది. 

ఆ విషయం కాస్త పక్కన పెడితే సౌర విద్యుత్ ప్రాజెక్టుల ఏర్పాటుకు సంబంధించి ముడుపులు ఇచ్చారు అంటూ ప్రముఖ పారిశ్రామికవేత్త గౌతమ్ అదానీ ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో ఆయనపై అందరూ ఘాటుగానే విమర్శలు చేస్తున్నారు. జగన్ అవినీతి రాష్ట్రాన్ని, దేశాన్ని దాటి అంతర్జాతీయ స్థాయికి ఎదిగింది అని పలువురు సభ్యులు సభలో ప్రస్తావించారు.ఇదిలా ఉంటే చంద్రబాబు మాత్రం ఈ విషయంపై నేరుగా స్పందించడం లేదు. 

ఈ విషయంపై ఎంతో సున్నితంగా విమర్శిస్తూ ఓ ప్రత్యేకమైన వ్యూహంతో చంద్రబాబు ముందుకు వెళ్తున్నట్లు కనిపిస్తోంది. అదానీ గుజరాత్ కి చెందిన వ్యాపార సంస్థ.. పైగా అదానీ ఇటు మోడీకి, అటు అమిత్‌ షాకు ఆప్తుడు. కాబట్టి ఆయనకు బీజేపీ తో అవినాభావ సంబంధం ఉంది. అందుకే చంద్రబాబు ఈ విషయంపై డైరెక్ట్ గా స్పందించడం లేదు అన్న వాదన కూడా బలంగా వినిపిస్తోంది. మరి ఈ నేపథ్యంలో బాబు తన వ్యూహాన్ని ఎలా మారుస్తారు? అదానీ విషయంలో జగన్ పరిస్థితి ఏమిటి అనేది తెలియాల్సి ఉంది.

 

 

 

praneet praneet praneet Koncept Ambience Radhey Skye APR Group
Tags :