త్వరలోనే కర్నూలు లో హైకోర్టు బెంచ్ : సీఎం చంద్రబాబు
త్వరలోనే కర్నూలులో ఏపీ హైకోర్టు బెంచ్ ఏర్పాటవుతుందని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలిపారు. కర్నూలులో హైకోర్టు బెంచ్ ఏర్పాటుపై శాసనసభలో తీర్మానం ప్రవేశపెట్టిన సందర్భంగా చంద్రబాబు మాట్లాడారు. లోకాయుక్తా, ఏపీ హెచ్‌ఆర్సీ తదితర సంస్థలు కూడా అక్కడే ఉంటాయని వెల్లడిరచారు. రాష్ట్రంలోని ఇతర ప్రాంతాలు కూడా అభివృద్ధి కావాలి. గత ప్రభుత్వం మూడు రాజధానులని మూడు ముక్కలాట ఆడిరది. ఎన్నికల ముందు కర్నూలు, విశాఖపట్నంలోనూ రాజధాని అమరావతి అని చెప్పిన ఘనత కూటమిది. రాష్ట్ర సమగ్ర అభివృద్ధి టీడీపీతోనే సాధ్యం. గతంలో చేశాం. ఇప్పుడు చేసిన చూపిస్తున్నాం. తెలుగు గంగ, హంద్రీనీవా, గాలేరు` నగరి లాంటి ప్రాజెక్టులను టీడీపీ ప్రభుత్వం ప్రారంభించింది. ఇప్పుడు ఆ ప్రాజెక్టులను పూర్తిచేసేది ఎన్డీయే ప్రభుత్వమే. కృష్ణా జలాలను రాయలసీమకు తీసుకెళ్లాం. నదుల అనుసంధానంతో రాయలసీమకు తాగు, సాటునీటి సమ్య లేకుండా చేస్తాం. కొప్పర్తి, ఓర్వకల్లు, కస్లర్ల కోసం రూ.5 వేల కోట్లు కేటాయించాం అని చంద్రబాబు తెలిపారు