రాజ్యసభ రేసులో గల్లా జయదేవ్ ?
మాజీ ఎంపీ, తెలుగుదేశం పార్టీ నాయకులు గల్లా జయదేవ్‌కు రాజ్యసభ టికెట్ ఇచ్చేందుకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నిర్ణయించినట్టు అత్యంత విశ్వసనీయంగా తెలిసింది. గల్లా పేరుకు కూటమి నేతలు కూడా అంగీకరించినట్లు చెబుతున్నారు. రాష్ట్రంలో ఖాళీ ఏర్పడిన 3 రాజ్యసభ స్థానాలకు వచ్చే నెలలో ఎన్నికలు జరిగేలా ఎన్నికల కమిషన్ నోటిఫికేషన్ విడుదల చేసింది. తాజా సమాచారం ప్రకారం ఈ మూడు స్థానాల్లో రెండు తెలుగుదేశం పార్టీ తీసుకొని ఒక స్థానాన్ని జనసేనకు కేటాయించే అవకాశం ఉందని చెబుతున్నారు. టీడీపీ నుంచి కంభంపాటి రామ్మోహన్ రావు, గల్లా జయదేవ్ ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ చంద్రబాబు గల్లా జయదేశ్ అభ్యర్థిత్వం పట్ల మొగ్గు చూపుతున్నట్లు తెలిసింది. జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కూడా గల్లా జయదేవ్ అభ్యర్థిత్వం పట్ల సానుకూలంగా స్పందించినట్లు వార్తలు వస్తున్నాయి. దీంతో గల్లా పేరు ప్రకటించడమే తరువాయి. మరో రెండు మూడు రోజుల్లో ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారికంగా గల్లా జయదేవ్ పేరు ప్రకటిస్తారని టీడీపీ వర్గాలు భావిస్తున్నారు. అయితే టీడీపీ నుంచి రాజ్యసభ సీటు ఆశిస్తున్న వారి సంఖ్య ఎక్కువగా ఉన్నప్పటికీ వారిని బుజ్జగించి గల్లా జయదేవ్ పేరు ప్రకటిస్తారని భావిస్తున్నారు.