ASBL Koncept Ambience
facebook whatsapp X

Chandrababu – Peddireddy : పెద్దిరెడ్డి – చంద్రబాబు మధ్య సీక్రెట్ లవ్..!?

Chandrababu – Peddireddy : పెద్దిరెడ్డి – చంద్రబాబు మధ్య సీక్రెట్ లవ్..!?

చంద్రబాబు నాయుడికి, పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డికి మధ్య దశాబ్దాలుగా వైరం ఉంది. శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీలో (SV University) వీళ్లిద్దరూ చదువుకుంటున్నప్పుడే ఈ గ్యాప్ మొదలైంది. అది పెరిగి పెద్దదైంది. ఇప్పటికీ అది అలాగే కొనసాగుతోంది. రాజకీయంగా ఒకరిపై ఒకరు ఎదిగేందుకు అందివచ్చిన ఏ అవకాశాన్నీ మిస్ చేసుకోరు. చిత్తూరు జిల్లాలో (Chittoor District) వీళ్లిద్దరి ఇద్దరి మధ్య శతృత్వం గురించి కథలు కథలుగా చెప్పుకుంటూ ఉంటారు. ఇద్దరూ పైకి చూడడానికి సాఫ్ట్ గానే కనిపిస్తారు కానీ లోలోపల వ్యూహాలు మాత్రం కోలుకోలేని దెబ్బతీసేలా ఉంటాయి. అయితే ఇదంతా నాణేనికి ఒకవైపే అంటున్నారు కొందరు.

పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డికి (Peddireddy Ramachandra Reddy), చంద్రబాబుకు (Chandrababu Naidu) మధ్య రహస్య స్నేహం ఉందని కొంతకాలంగా గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇవిగో ఆధారాలు అంటూ కొందరు ప్రూఫ్స్ కూడా బయట పెడుతున్నారు. అలాంటి వాటిలో ఒకటి ఇప్పుడు బయటికొచ్చింది. మేలో జరిగిన ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ (YSRCP) తరపున 11 మంది గెలిస్తే అందులో ముగ్గురు పెద్దిరెడ్డి కుటుంబీకులే.! పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కూడా పుంగనూరు (Punganur) నుంచి విజయం సాధించారు. కూటమి హవాలో కూడా ముగ్గురు పెద్దిరెడ్డి కుటుంబీకులు విజయం సాధించడం చాలా మందిని ఆశ్చర్యానికి గురి చేసింది.

అయితే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి లోలోపల చంద్రబాబు సహకారం ఉందనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గెలుపును సవాల్ చేస్తూ భారత చైతన్య యువజన పార్టీ (BCY Party) అధినేత రామచంద్ర యాదవ్ (Ramachandra Yadav) కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. 142కుపైగా ఆస్తులను పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అఫిడవిట్ (affidavit) లో చూపించలేదనేది ఆ పిటిషన్ సారాంశం. దీన్ని విచారణకు స్వీకరించింది హైకోర్టు. ఈ ఎన్నికల్లో రెండో స్థానంలో నిలిచిన టీడీపీ అభ్యర్థి చల్లా రామచంద్రారెడ్డి (చల్లా బాబు)తో (Challa Babu) పాటు ఎన్నికల కమిషన్ (EC), ప్రభుత్వానికి హైకోర్టు (High Court) నోటీసులు జారీ చేసింది. అయితే ఈ నోటీసులపై అటు ప్రభుత్వం కానీ, ఇటు చల్లాబాబు కానీ స్పందించట్లేదు.

వాస్తవానికి రామచంద్ర యాదవ్ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తప్పు చేశారనేదానికి సంబంధించి అన్ని ఆధారాలను కోర్టు ముందుంచారు. వాస్తవానికి ఈ కేసుతో రామచంద్ర యాదవ్ కు పైసా ప్రయోజనం ఉండదు. కోర్టు ఆయన్ను అనర్హుడిగా ప్రకటిస్తే టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసి రెండో స్థానంలో నిలిచిన చల్లా బాబు ఎమ్మెల్యేగా ఎన్నికవుతారు. ఎవరైనా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటారు. అయితే కోర్టు నోటీసులను టీడీపీకానీ, చల్లాబాబు కానీ దీన్ని పట్టించుకోవట్లేదు. ఇప్పటికే రెండు సార్లు నోటీసులు జారీ చేసింది హైకోర్టు.

ప్రభుత్వం, చల్లాబాబు తీరు చూసిన తర్వాత టీడీపీ నేతలు, శ్రేణులకు అనుమానాలు మరింత బలపడ్డాయి. పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి వల్ల గత ఐదేళ్లలో జిల్లాలో ఎన్ని ఇబ్బందులు పడ్డామో తమకు తెలుసని.. ఇప్పుడు అతడిపై అనర్హత వేటు పడే అవకాశం వచ్చినా దాన్ని సద్వినియోగం చేసుకోకపోవడమేంటని తెలుగు తమ్ముళ్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అయితే చంద్రబాబుతో పాటు కొంతమంది టీడీపీ నేతలతో పెద్దిరెడ్డికి రహస్య స్నేహం ఉందని.. అందుకే ఈ అంశాన్ని పార్టీ సీరియస్ గా తీసుకోవట్లేదని కొందరు అభిప్రాయపడుతున్నారు. చంద్రబాబు, చల్లా బాబు తీరు కూడా దీనికి బలం చేకూరుస్తోంది. 

 

 

 

 

praneet praneet praneet ASBL Radhey Skye Radha Spaces
Tags :