ASBL NSL Infratech

సిఎఎ వనభోజనాలకు మంచి స్పందన

సిఎఎ వనభోజనాలకు మంచి స్పందన

చికాగో ఆంధ్ర సంఘం (CAA) వార్షిక వనభోజనాలు  బస్సీ ఉడ్స్ తోటలో జరిపారు. ఈ ఏడాది వనభోజనాలతో పాటు పితృదినోత్సవాన్ని కూడా వేడుకగా నిర్వహించారు. సంప్రదాయ అరిటాకులో వడ్డించిన భోజనాలు, అన్ని వయసుల వారినీ ఆకట్టుకునే ఆట పాటలు, పలు పోటీలతో హాజరైన వారందరినీ ఆద్యంతం అలరించేలా రోజంతా సాగిపోయింది. 

సంస్థ 2024 అధ్యక్షురాలు శ్వేత కొత్తపల్లి, మరియు చైర్మన్ శ్రీనివాస్ పెదమల్లు గారి ఆధ్వర్యంలో, ఉపాధ్యక్షులు శ్రీకృష్ణ మతుకుమల్లి గారి సహకారంతో  జరిగిన ఈ కార్యక్రమానికి 1000 మందికి పైగా చికాగో వాసులు విచ్చేసారు. సంస్థ అభ్యున్నతిని ఎంతో ప్రోత్సహిస్తున్న స్పాన్సర్లు కూడా విచ్చేసి ఆటపాటలలో ఉత్సాహంగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమం లో పలు తెలుగు సంఘ నాయకులు పాల్గొని వారి సహకారాన్ని అందించటం ప్రశంశనీయం.

మన జీవితాల్లో తాము అందించే నిస్వార్థ ప్రేమ, అపరిమితమైన ధైర్యం , అనంత త్యాగాలకు నాన్నలు అందరికీ చికాగో ఆంధ్ర సంఘం వారు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేసారు. ఈ కార్యక్రమానికి టీవీ మరియు సినీ కళాకారులు ఉదయ్ భాస్కర్ గారు ముఖ్య అతిధిగా విచ్చేసారు. 

సంస్థ యొక్క ట్రస్టీలు శ్రీనివాస్-మల్లేశ్వరి పెదమల్లు, పద్మారావు అప్పలనేని, రాఘవ-శివబాల జాట్ల, దినకర్ కారుమూరి, డా. ఉమ కటికి, పూర్వ అధ్యక్షులు గౌరీశంకర్ అద్దంకి కార్యక్రమనికి విచ్చేసి తమ సహకారాన్నందించారు.

హేమంత్ తలపనేని గారి ఆధ్వర్యంలో, విసృత్, హాసినీ తలపనేని, లోహిత గంపాల, ఇషాన్వి వేముల మున్నగు వారు సభ్యత్వ నమోదు మరియు కార్యక్రమ రెజిస్ట్రేషన్ నిర్వహిస్తు విచ్చేసిన వారందరినీ ఆప్యాయంగా స్వాగతించారు.

ఉదయం 11 గం॥ లకు ఈ కార్యక్రమాన్ని మొదలుపెట్టగా, విచ్చేసిన వారందరికీ వేసవి లో సేద తీరేందుకు చీడే అమ్మాజీ గారు ఎంతో ఆప్యాయంగా చేసిన సబ్జా పానీయంతో స్వాగతించారు. 

సవిత మునగ Lunch Box contest ను, My Father - My Hero contest ను శ్రీస్మిత నండూరి, ప్రియ మతుకుమల్లి, శృతి కూచంపూడి సమన్వయించారు. ఈ పోటీల్లో పిల్లలు, పెద్దలు ఎంతో ఉత్సాహంగా పాల్గొని ఆనందించారు. విజేతలందరికీ ఆకర్షణీయమైన బహుమతులను అందజేశారు.

Seniors అందరినీ అలరించేందుకు వైకుంఠ పాళి, అష్టాచెమ్మా వంటి ఆటలను రాధిక గరిమెళ్ళ, హరిణి మేడ, మల్లీశ్వరి పెదమల్లు, మాధురి యేటిగడ్డ నిర్వహించారు.  పిల్లలకు కో కో, కబడ్డీ, Tug of War, Father’s Day Workshop వంటి అనేక ఆటలు ఏర్పాటు చేయటంతో పిల్లలు mobiles కు దూరంగా ఉత్సాహంగా ఆటలతో అలరింపడటం విశేషం. PlayStations ను గీతిక ఐనపూడి, ఆశ్రిత్ కొత్తపల్లి, ఆద్య బెస్త, ఆరాధ్య బెస్త, శ్వేతకి బొజ్జ, కళ్యాణ్ కొత్తపల్లి, రేయాంష్ వేముల, విష్ణు హాసిని, విష్ణు తేజ మున్నగు Youth Volunteers నిర్వహించారు.

నరేష్ చింతమాని ఆధ్వర్యంలో, స్థానిక ఇండియన్ రెస్టారెంట్ Naatu వారు అందించిన రుచికరమైన భోజనం - కమ్మటి గుమ్మడికాయ పులుసు, రుచికరమైన కూరలు, పసందైన బిర్యానీ వంటి వంటకాలను ఆహూతులందరికీ అరిటి ఆకుల్లో కొసరి కొసరి వడ్డించారు. పిల్లలకోసం పిజ్జా ట్విస్ట్ రెస్టారెంట్ వారు పిజ్జాలు అందజేసారు. 

Grilled chicken, మెక్కజొన్న, చల్లటి పుచ్చకాయ, వేడి వేడి పకోడీలు, టీ తో పాటు Yogi’s Ice cream వారి Ice cream  లను సాయంత్రం పిల్లలు, పెద్దలు పలహారం గా ఆస్వాదించారు. సతీశ్ పసుపులేటి, నరసింహ రెడ్డి ఒగ్గు, రాజు బొజ్జ, కాశి ఆళ్ళ, మల్లిక్ గోలి, సురేశ్ ఐనపూడి, సునీల్ ఆకులూరి, ధీరజ్ ఐనపూడి, తన్విక్ అండే, సుయాన్శ్, మృత్యుంజయరావు గొంటు మున్నగు వారు సహకారాన్ని అందిచారు.

ఈ వేడుకల్లో Occasions by Krishna కృష్ణ జాస్తి గారు ఏర్పాటు చేసిన అందమైన ఫోటో బూత్ వద్ద పెద్దలు, పిల్లలు చక్కని ఫోటోలు తీయించుకున్నారు.

వేడుకను విజయవంతం చేయడానికి సహకరించిన స్పాన్సర్ల ను, బోర్డ్ ఆఫ్ డైరెక్టర్లు సవిత మునగ, అనూష బెస్త, శైలజ సప్ప, శ్రీ స్మిత నండూరి, లక్ష్మి నాగ్ సూరిభొట్ల, హేమంత్ తలపనేని, గీతిక మండల, మురళీ రెడ్డివారి, పద్మారావు అప్పలనేని, నరసింహరావు వీరపనేని, ప్రభాకర్ మల్లంపల్లి, శ్రీనివాస్ పద్యాల, గిరి రావు కొత్తమాసు, మనస్వి తూము, కావ్య శ్రీ చల్ల; ట్రస్టీలు అందరికీ సంఘ అధ్యక్షురాలు శ్వేత కొత్తపల్లి ధన్యవాదాలు తెలియచేసారు.

 

Click here for Photogallery

 

 

praneet praneet praneet obili-garuda Vertex poulomi Png-jewelry
Tags :