చైనా కంపెనీ వింత ప్రకటన
చైనా కొంతకాలంగా తీవ్ర జనాభా సంక్షోభాన్ని ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో దీని నుంచి బయటపడేందుకు అక్కడి పలు కంపెనీలు తమ ఉద్యోగులకు ఆసక్తికరమైన కాంటెస్ట్‌లు పెడుతున్నాయి. అందులో భాగంగా ఓ కంపెనీ సింగిల్‌గా ఉన్న తమ ఉద్యోగులు డేటింగ్‌కు వెళ్లేలా ప్రోత్సహిస్తుంది. అందుకు వారికి కొంత నగదు బహుమతిని అందిస్తుంది. దక్షిణ చైనాలో షెన్‌జైన్‌లోని ఓ టెక్ కంపెనీ ఈ ఆఫర్‌ను ప్రవేశపెట్టింది. ఇందుకుగాను ఆ సంస్థకు చెందిన డేటింగ్ ఫ్లాట్‌ఫార్మ్‌లో కంపెనీలోని సింగిల్స్ బయటి వ్యక్తులు ఆకర్షితులయ్యేలా ఆప్‌లో పోస్ట్‌లు పెట్టాలి. అందుకుగాను వారికి 66 యువాన్లు ( భారత కరెన్సీలో రూ.770) ఇస్తారు. ఆ తర్వాత ఆ వ్యక్తితో మూడు నెలల పాటు డేటింగ్ కొనసాగించాలి. దీనికి ఒక్కొక్కరికీ వెయ్యి యువాన్లు (రూ.11,650) రివార్డును అందిస్తారు. అయితే, పలువురు ఈ ప్రకటనను ఆహ్వానించగా మరికొందరు దీన్ని వ్యతిరేకిస్తున్నారు.