ASBL Koncept Ambience
facebook whatsapp X

Chandrababu: కాకినాడ పోర్టు, సెజ్‌ ఆక్రమణపై సీఐడీ విచారణ : సీఎం చంద్రబాబు

Chandrababu: కాకినాడ పోర్టు, సెజ్‌ ఆక్రమణపై సీఐడీ విచారణ : సీఎం చంద్రబాబు

కాకినాడ పోర్టు, సెజ్‌ ఆక్రమణపై సీఐడీ విచారణ జరిపిద్దామని ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. మంత్రివర్గ సమావేశం అనంతరం మంత్రులతో సీఎం వివిధ అంశాలపై చర్చించారు. ఈ సందర్భంగా రేషన్‌ బియ్యం అక్రమణ రవాణా, కాకినాడ పోర్టు (Kakinada port ) అంశాలు చర్చకు వచ్చినట్టు తెలిపింది.  కాకినాడ పోర్టును, కాకినాడ సెజ్‌ను బలవంతంగా లాక్కున్నారు. పోర్టు లాగేసుకుని 41 శాతం కేవీ రావుకు ఇచ్చేసి 59 శాతం అరబిందో (Aurobindo) వాళ్లకు అప్పగించారు.  ఆస్తులను గుంజుకోవడం రాష్ట్రంలో కొత్త ట్రెండ్‌ అయ్యింది. ఇంతుకు ముందు మనం ఎప్పుడూ ఇలాంటివి చూడలేదు. వైసీపీ (YCP) ప్రభుత్వంలో వ్యవస్థలను బాగా డ్యామేజ్‌ చేశారు. వీటన్నింటిపై సీఐడీ విచారణ జరిపిద్దాం అని మంత్రులతో చంద్రబాబు (Chandrababu) అన్నారు.  రాష్ట్రానికి సుదీర్ఘ తీర ప్రాంతం ఉందని, దాన్ని ఎలా సద్వినియోగం చేసుకోవాలనేదానిపై మంత్రులతో సీఎం చర్చించారు.

 

 

 

 

praneet praneet praneet Koncept Ambience Radhey Skye APR Group
Tags :