ASBL Koncept Ambience
facebook whatsapp X

మెటా-ఏపీ ప్రభుత్వం మధ్య ఒప్పందం.. రానున్న రోజుల్లో

మెటా-ఏపీ ప్రభుత్వం మధ్య ఒప్పందం.. రానున్న రోజుల్లో

ఆంధ్రప్రదేశ్‌లో పౌర సేవలు మరింత సులభతరం కానున్నాయి. ఈ మేరకు మెటా-ఏపీ ప్రభుత్వం మధ్య ఒప్పందం కుదిరింది. ఈ సందర్భంగా ఐటీ, విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్‌ మాట్లాడుతూ యువగళం హామీలు నెరవేర్చడంలో మెటాతో ఎంవోయూ చారిత్రాత్మక మైలురాయిగా అభివర్ణించారు. విద్యార్థులు, నిరుద్యోగులు వివిధ సర్టిఫికెట్ల కోసం పడుతున్న కష్టాలు యువగళం పాదయాత్ర సందర్భంగా ప్రత్యక్షంగా చూశా. మొబైల్‌ ద్వారానే  అయా సర్టిఫికెట్లు అందిస్తామని పాదయాత్రలో హామీ ఇచ్చా. ఇచ్చిన హామీ మేరకు వాట్సాప్‌ ద్వారానే వివిధ రకాల సర్టిఫికెట్లు, పౌరసేవలు అందించేలా మెటాతో ఒప్పందం చేసుకున్నాం. రానున్న రోజుల్లో మరిన్ని సేవలు ఆన్‌లైన్‌లో అతి సులువుగా, పారదర్శకంగా, అతి వేంగా పొందే ఏర్పాట్లు చేస్తాం అని తెలిపారు.
 

 

 

praneet praneet praneet ASBL Radhey Skye Radha Spaces
Tags :