ASBL Koncept Ambience
facebook whatsapp X

వైసీపీ ను విడుతున్న సన్నిహితులు, బంధువులు.. ఇక జగన్ కు ఒంటరి పోరాటం తప్పదా..

వైసీపీ ను విడుతున్న సన్నిహితులు, బంధువులు.. ఇక జగన్ కు ఒంటరి పోరాటం తప్పదా..

2019లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో చారిత్రాత్మికమైన విజయాన్ని సొంతం చేసుకున్న వైసీపీ.. 2024లో ఎవ్వరు ఊహించని పరాజయాన్ని మూటకట్టుకుంది. బంధువుల విలువ మన బాధల్లోనే తెలుస్తుంది అన్నట్లుగా ఇప్పుడు కొందరు వైసీపీ నేతల అసలు రంగు బయటపడుతోంది. కష్టకాలంలో జగన్‌కు అండగా నిలుస్తారు అనుకున్న వాళ్లు ఏదో ఒక కారణంతో పార్టీని వీడి వెళ్ళిపోతున్నారు. ఇప్పటివరకు జగన్‌తో ప్రయాణించిన ఆయన సన్నిహితులు, బంధువులు కూడా పార్టీ నుంచి నిష్క్రమిస్తున్నారు. తాజాగా 23 మంది ఎమ్మెల్యేలు, ఐదుగురు దాకా ఎంపీలు పార్టీని విడిపోవడం అందరికీ షాకింగ్ గా ఉంది. వైయస్సార్ మరణానంతరం జగన్ చుట్టూ కంచుకోటలా నిలబడి ఎన్నికల్లో గెలిపించిన వారు ఇప్పుడు వెన్నుపోటు పొడుస్తున్నారు. బంధాలు లేవు.. బంధుత్వాలు లేవు అని తేల్చి చెబుతున్నారు. 

మోపిదేవి వెంకట రమణ వైసీపీ‌ను వదిలి వెళతారు అన్న ఊహ కూడా ఎవరికీ రాలేదు. మరోపక్క వైయస్సార్ కుటుంబానికి అత్యంత సన్నిహితుడైన ఆళ్ళ నాని వైసీపీ కి గుడ్ బై కొట్టేశారు. ఇక ఇప్పుడు తాజాగా జగన్ కు అత్యంత సన్నిహితుడు.. దగ్గర బంధువు అయిన మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి పార్టీలో ఇమడలేను అని స్పష్టం చేశారు. బంధాలకి బంధుత్వాలకి.. రాజకీయాలకు సంబంధం లేదు అంటూ పార్టీని వదిలి పెట్టారు. ఇక జగన్ సొంత చెల్లి షర్మిల విషయం అందరికీ తెలిసిందే. 

బాబాయి వివేకా కూతురు సునీత గురించి కూడా ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. వైయస్సార్ పాలనలో, జగన్ హయాంలో ఆంధ్ర ఎన్నో తుఫానులను, వరదలను చూసింది.. అయితే అప్పుడప్పుడు స్పందించని సునీత ప్రత్యేకించి ఇప్పుడు చంద్రబాబుకి 10 లక్షల చెక్కును అందివ్వడం అన్న పై ఆమె వ్యతిరేకతకు నిదర్శనం అని అందరూ అంటున్నారు. అయితే ప్రస్తుతం వైసీపీలో జరుగుతున్న ఈ తంతు ఓ ప్రక్షాళనకు నాంది కావచ్చు.. పూర్వ వైభవానికి ప్రతీక కావచ్చు.. జగన్ మాత్రం ఎప్పటిలా ఒంటరి పోరుకు సిద్ధపడుతూ మౌనంగానే ఉన్నారు.

 

 

 

praneet praneet praneet ASBL Radhey Skye Radha Spaces
Tags :