ASBL Koncept Ambience
facebook whatsapp X

వారిని వదిలిపెట్టను.. సీఎం చంద్రబాబు హెచ్చరిక

వారిని వదిలిపెట్టను.. సీఎం చంద్రబాబు హెచ్చరిక

మహిళలు అన్ని వేళలా ఆత్మగౌరవంతో జీవించాలని ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు.  దీపం 2.0లో భాగంగా శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురం మండలం ఈదుపురంలో ఉచిత గ్యాస్‌ సిలిండర్‌ పథకాన్ని  ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఈదుపురంలో ఏర్పాటు చేసిన ప్రజావేదికలో చంద్రబాబు మాట్లాడుతూ  మొన్నటి ఎన్నికల్లో తెలుగు తమ్ముళ్లు, జనసైనికులు రాజీలేని పోరాటం చేశారు. వైసీపీ నేతలు ప్రజాస్వామ్య హద్దులు దాటి ఇబ్బంది పెట్టారు. బాధ్యతగల ప్రజాప్రతినిధిని, తప్పు చేసిన వారిని వదలిపెట్టను, రాజకీయ కక్షసాధింపులకు పోను. నాయకుడు అంటే ప్రజల మనస్సుల్లో అభిమానం ఉండాలి. సమాజం పట్ల బాధ్యత కలిగిన వ్యక్తిని నేను. కట్టెల పొయ్యితో మహిళలు పడిన బాధలు  నాకు తెలుసు. దీపం పథకం కింద సిలిండర్‌ ఇచ్చి మహిళల కష్టాలు తీర్చా, డ్వాక్రా సంఘాలకు మళ్లీ పూర్వ వైభవం తెస్తాం. మహిళల్ని పారిశ్రామికవేత్తలుగా మారుస్తామన్నారు.
 

 

 

praneet praneet praneet ASBL Radhey Skye Radha Spaces
Tags :