ASBL NSL Infratech
facebook whatsapp X

తయారీ రంగానికి ఏపీ వ్యూహాత్మక ప్రాంతం

తయారీ రంగానికి ఏపీ వ్యూహాత్మక ప్రాంతం

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో నైపుణ్య గణనపై ప్రధానంగా దృష్టి సారించామని ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు. విశాఖలో నిర్వహించిన సీఐఐ నేషనల్‌ కౌన్సిల్‌ సమావేశంలో సీఎం పాల్గొన్నారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ  ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ఉద్యోగ అవకాశాలు అందిపుచ్చుకునేందుకే స్కిల్‌ సెన్సస్‌. గ్లోబల్‌ ఉద్యోగ అవకాశాలు పొందేలా చూస్తామన్నారు. తయారీ రంగానికి ఏపీ వ్యూహాత్మక ప్రాంతం. విశాఖను ఫిన్‌టెక్‌ హబ్‌గా తీర్చిదిద్దుతాం అన్నారు. ఆగ్రో ఇండస్ట్రీస్‌ రంగంలో ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నో అవకాశాలు ఉన్నాయి. రాష్ట్రంలో సుదీర్ఘ తీర ప్రాంతం ఉంది, మౌలిక సదుపాయాలు ఉన్నాయి. ఫార్మా, ఆటోమొబైల్‌, హార్డ్‌వేర్‌ రంగాల్లో విస్తృత అవకాశాలు ఉన్నాయి అని తెలిపారు. 
 

 

 

praneet praneet praneet ASBL Radhey Skye
Tags :